Earthquake Today: మరోసారి భారీ భూకంపం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు! (వీడియో)

మరోసారి భూమి కంపించింది. ఎవరూ ఊహించని స్థాయిలో భూమి కదిలింది. శుక్రవారం (ఇవాళ) తెల్లవారుజామున నేపాల్‌లో ఈ ఘటన జరిగింది. దాదాపు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. హిమాలయా మధ్య ప్రాంతంలోని సింధుపాల్‌చౌక్ జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి.

New Update
earthquake today in nepal

earthquake today in nepal

మరోసారి భూమి కంపించింది. ఎవరూ ఊహించని స్థాయిలో భూమి కదిలింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి పరుగులు తీసారు. ఈ ఘటన శుక్రవారం (ఇవాళ) తెల్లవారుజామున నేపాల్‌లో జరిగింది. హిమాలయ మధ్య ప్రాంతంలోని సింధుపాల్ చౌక్ జిల్లా భైరవకుండ వద్ద భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాదాపు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

ఇది కూడా చూడండిఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై దాదాపు 6.1గా నమోదు అయింది. అయితే అదే సింధుపల్‌చోక్ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. నేపాల్‌లో మాత్రమే కాకుండా భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

దీంతో ఒక్కసారిగా ప్రజలు తమ ఇల్లు, భవనాలోంచి బయటకు పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో గజగజ వణికిపోతున్నారు. ఇలా జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు.

Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!

పాకిస్థాన్‌లో కూడా

ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లో కూడా భూకంపం సంభవించింది. అక్కడ రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదు అయింది. ఈరోజు 05.14 ISTకి పాకిస్తాన్‌ను తాకింది.

Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!

పాట్నా, బీహార్‌లో కూడా

మరోవైపు పాట్నా, బీహార్‌లోని ఇతర ప్రాంతాలలో కూడా భారీ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా భవనాలు, రోడ్లు వణుకుతున్నట్లు చూపించే వీడియోలను పాట్నాలోని ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు