Budget 2026: మావోయిస్టుల ఏరివేతకు రూ.3610 కోట్ల బడ్జెట్.. 20% పెంపు

నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మార్చి 31ని గడువుగా నిర్ణయించిన కేంద్రం, దానికోసం బడ్జెట్‌లో నిధుల వర్షం కురిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏకంగా రూ.3,610 కోట్లను కేటాయించింది. ఇది గత బడ్జెట్ అంచనాల కంటే 20 శాతం కంటే ఎక్కువ.

New Update
_fight against Naxalism

దేశంలో నక్సలిజం అంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటీవల కాలంలో ఈ యాక్షన్ ప్లాన్ స్పీ్డ్‌అప్ చేసింది. దాదాపు  అగ్రనేతలను ఎన్‌కౌంటర్‌లో ఏరివేశారు భద్రతా బలగాలు. మిగిలిన వారు వరసగా లొంగిపోయారు. వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు మార్చి 31ని గడువుగా నిర్ణయించిన కేంద్రం, అందుకు అనుగుణంగా తాజా బడ్జెట్‌లో నిధుల వర్షం కురిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏకంగా రూ.3,610 కోట్లను కేటాయించింది. ఇది గత బడ్జెట్ అంచనాల (రూ.3,006 కోట్లు) కంటే 20 శాతం కంటే ఎక్కువ కావడం విశేషం.

కేటాయించిన ఈ భారీ నిధులను ప్రధానంగా రెండు విభాగాలలో ఖర్చు చేయనున్నారు.
భద్రతా పరమైన ఖర్చులు: నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరించిన భద్రతా దళాల ఆధునికీకరణ, ఆయుధ సంపత్తి, కార్యాచరణ ఖర్చుల కోసం వీటిని వినియోగిస్తారు.
ప్రత్యేక మౌలిక వసతుల పథకం: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, కమ్యూనికేషన్ టవర్లు, పోలీస్ స్టేషన్ల పటిష్టత వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు వెచ్చిస్తారు.

నక్సలిజంపై పోరాటాన్ని త్వరితగతిన ముగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. మార్చి 31ని డెడ్‌లైన్‌గా పెట్టుకుని, ఆ లోపు వామపక్ష తీవ్రవాద ప్రభావాన్ని నామరూపాలు లేకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అభివృద్ధి, భద్రత అనే రెండంచుల వ్యూహంతో ముందుకు వెళ్తున్న కేంద్రం, ఈ భారీ నిధుల కేటాయింపు ద్వారా తన పట్టుదలను చాటుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సామాన్యులకు మెరుగైన భద్రతను, అభివృద్ధిని అందిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు