Budget 2026: నిర్మలా సీతారామన్ చెప్పిన ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటో తెలుసా?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆరెంజ్‌ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.

New Update
Nirmala Sitharaman

Nirmala Sitharaman

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆరెంజ్‌ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ఈ వ్యవస్థను ప్రోత్సహించేందుకు మాధ్యమిక పాఠశాలలు, కళాశాలల్లో కంటెంట్‌ను క్రియోట్‌ చేసే ప్రయోగశాలలు ప్రారంభిస్తామని తెలిపారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌, గేమింగ్, కామిక్స్‌ రంగంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. 2030 నాటికి 20 లక్షల మంది నిపుణులు అవసరమని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముంబైకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో AVGC కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనుంది. 

ఆరేంజ్ ఎకానమి అంటే 

మీడియా, వినోదం, మేధోసంపత్తి లాంటి క్రియేటివ్‌ రంగాలను సూచించే పదాన్నే ఆరెంజ్‌ ఎకానమీ అని పిలుస్తారు. ఆర్థిక సర్వే 2025-26 ఆధారంగా దీనికి సంబంధించి ఈ ప్రతిపాదనను రూపొందించారు. ఆరెంజ్‌ ఎకానమీ అనే పేరును మొదటగా కొలంబియా మాజీ అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ మార్క్వెజ్, మాజీ సాంస్కృతిక మంత్రి ఫెలిపే బుయిట్రాగో రూపొందించారు. నారింజ రంగు అనేది  ప్రపంచ సాంస్కృతిక, సృజనాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుందని తెలిపారు.  

Also Read: MGNREGAతో పోలిస్తే, జీ రామ్ జీ స్కీమ్ కు భారీగా నిధులు.. ఉపాధి హామీకి ఎంత బడ్జెటో తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్‌ ప్రసంగంలో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాల్లో "క్రియేటివ్ స్టార్టప్ హబ్స్" ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కంటెంట్ క్రియేటర్లకు కావాల్సిన అత్యాధునిక స్టూడియోలు, సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉంటాయి. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగంలో స్టార్టప్లు పెట్టే యువతకు ప్రత్యేక పన్ను రాయితీలు ఉంటాయి. 

కళాకారులు, డిజిటల్ క్రియేటర్ల నైపుణ్యాన్ని పెంచడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే భారతీయ సినిమాలు, సంగీతం, డిజిటల్ కంటెంట్‌ను గ్లోబల్ మార్కెట్‌లో ప్రచారం చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించనున్నారు. సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో కేవలం చదువు మాత్రమే కాకుండా,కళల ద్వారా కూడా లక్షలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుంది.

Also Read: నిర్మలమ్మ బడ్జెట్ సామాన్యులకు ఏమైనా మేలు చేసిందా?

Advertisment
తాజా కథనాలు