MBBS విద్యార్థినిపై అత్యాచారం కేసులో కొత్త మలుపు..స్నేహితుడు అరెస్ట్

బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో ఆమె స్నేహితుడి ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలితో కలిసి బయటకు వెళ్లిన ఆమె క్లాస్‌మేట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గంటల తరబడి విచారిస్తున్నారు.

New Update
rape

పశ్చిమ బెంగాల్‌(west bengal)లోని దుర్గాపూర్‌లో మెడికల్ స్టూడెంట్(medical student) పై  జరిగిన సామూహిక అత్యాచారం కేసు(rape-case)లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే, బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో ఆమె స్నేహితుడి ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలితో కలిసి బయటకు వెళ్లిన ఆమె క్లాస్‌మేట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గంటల తరబడి విచారిస్తున్నారు. బాధితురాలిని దుండగులు బలవంతంగా లాక్కెళ్తుంటే, ఆ స్నేహితుడు ఎందుకు అడ్డుకోలేదని, లేదా సహాయం కోసం ఎవరినీ ఎందుకు పిలవలేదని పోలీసులు ఆరా తీస్తున్నారు.

బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తన కుమార్తెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లడంలో లేదా దుండగులతో అతనికి ఏదైనా సంబంధం ఉండటంలో స్నేహితుడి పాత్రపై అనుమానాలు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, బాధితురాలు మొదట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తనపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, తన స్నేహితుడిని నిందితుడిగా పేర్కొనలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. చివరికి ఏం జరిగింది అనే దానిపై న్యాయమూర్తి ముందు బాధితురాలు ఇవ్వబోయే వాంగ్మూలం కీలకం కానుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, అరెస్టు అయిన ఐదుగురు నిందితులతో పాటు, బాధితురాలి స్నేహితుడిని కూడా పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లి క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ దారుణంపై రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి సైతం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Also Read :  బీజేపీలో చేరిన ఫోక్ సింగర్!

బాధితురాలు సంచలన విషయాలు

మరోవైపు అత్యాచార ఘటనపై బాధితురాలు సంచలన విషయాలు భయటపెట్టింది.  శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు కొంతమంది తమను వెంబడించారని తెలిపింది. వెంటనే తాము అడవి వైపు పరిగెత్తుతున్న సమయంలో తన స్నేహితుడు ఒకవైపు మరో వైపు తాను వెళ్లామని,  ఈ క్రమంలో నిందితులు తనను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లినట్లుగా చెప్పకొచ్చింది. తన ఫోన్‌ను లాక్కొని తన స్నేహితుడికి కాల్ చేయాలని బెదిరించారని.. అతడు రాకపోవడంతో తనపై దారుణానికి పాల్పడ్డారని వెల్లడించింది. 

వారినుంచి తప్పించుకోవడానికి తాను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుండగా అరిస్తే మరికొంతమందిని పిలుస్తామని నిందితులు తనను బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను, బాధితురాలి స్నేహితుడిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. బాధితురాలికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read :  బీజేపీ ఫస్ట్ లిస్టు రిలీజ్..9 మంది మహిళలకు చోటు

Advertisment
తాజా కథనాలు