Maithili Thakur : బీజేపీలో చేరిన ఫోక్ సింగర్!

బీహార్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ మంగళవారం తన రాజకీయ అరంగేట్రం చేసింది. పాట్నాలో రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ సమక్షంలో ఆమె భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు.

New Update
bihar mithali

బీహార్ ఎన్నికల(Bihar Elections 2025) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్(Maithili Thakur) మంగళవారం తన రాజకీయ అరంగేట్రం చేసింది. పాట్నాలో రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ సమక్షంలో ఆమె భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. ఠాకూర్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు భారత్ బింద్‌తో కలిసి ఆమెపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 12 సంవత్సరాల వయసులో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మైథిలి భోజ్‌పురి పాటలు పాడటం ద్వారా ప్రజాదరణ పొందారు. ఒక చిన్న అమ్మాయి అభిరుచిగా ప్రారంభమైన ఈ పాట ఇప్పుడు భారీ అభిమానుల సంఖ్యగా ఎదిగింది. 

Also Read :  ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహానం!

ఇన్‌స్టాగ్రామ్‌లో 63 లక్షలకు పైగా ఫాలోవర్లు

ఆమెకు ఇప్పుడు యూట్యూబ్‌లో 51 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 63 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మంది పేర్లతో బీజేపీ తన మొదటి జాబితాను విడుదల చేసిన రోజే ఆమె పార్టీలో చేరడం జరిగింది. మైథిలీ ఠాకూర్ ఇటీవల ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతలు, బీహార్ బీజేపీ ఇన్‌ఛార్జి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌లను తన తండ్రితో కలిసి కలిశారు. ఈ సమావేశం అనంతరం ఆమె రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు బలపడ్డాయి. యువ ఓటర్లను, ముఖ్యంగా మిథిలాంచల్ ప్రాంతంలోని ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ మైథిలీ ఠాకూర్‌ను బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బీహార్‌లోని మధుబని జిల్లాలో జన్మించిన మైథిలి, తన ఇద్దరు సోదరులతో కలిసి, వారి తాత, తండ్రి వద్ద జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. మైథిలి, భోజ్‌పురి, హిందీ భాషలలో బీహార్ సాంప్రదాయ జానపద పాటలను పాడారు. ఇక, గతంలో ఈమె ప్రధాని నరేంద్రమోదీ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శబరిని ఉద్దేశిస్తూ మైథిలి పాడిన పాటకుగాను ప్రధాని ఆమెను అభినందించారు.  మైథిలీ స్వస్థలం మధుబని జిల్లాలోని బెనిపట్టి కాబట్టి, ఆమెకు మధుబని లేదా దర్భంగా జిల్లాలోని అలినగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. మైథిలీ ఠాకూర్ వంటి యువ సెలబ్రిటీ రాజకీయ ప్రవేశం బీహార్ ఎన్నికల్లో బీజేపీకి అదనపు బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది.

Also Read :  IPS పురాన్ కేసులో మరో షాకింగ్.. ఆ గదిలో దర్యాప్తు అధికారి సూసైడ్!

Advertisment
తాజా కథనాలు