/rtv/media/media_files/2025/07/16/miscreants-pour-petrol-on-husband-and-wife-and-set-them-on-fire-in-palnadu-2025-07-16-09-09-03.jpg)
Atrocity in Odisha.. Thugs set girl on fire
ఓడిశాలో అమ్మాయిలు అగ్నికి ఆహుతి అవుతూనే ఉన్నారు. ఇటీవల బాలాసోర్‌లో డిపార్ట్‌మెంటల్ హెడ్ లైంగిక వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహుతికి పాల్పడిన బీఈడీ విద్యార్థిని ఘటన మరవక ముందే ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది. పూరీ జిల్లా బ్యాబర్ గ్రామంలో శనివారం ఓ15 ఏళ్ల బాలికకు ముగ్గురు దుండగులు నిప్పంటించారు. ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా అడ్డగించిన కొంతమంది దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారు. నిప్పు అంటుకుని తీవ్రంగా గాయపడిన బాలికను స్థానికులు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.
Also Read: అమెరికాలో రెడ్ అలెర్ట్..పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబ్
Atrocity in Odisha
ఈ ఘటనపై స్పందించిన ఉపముఖ్యమంత్రి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఇన్‌చార్జి ప్రవతీ పరిదా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒక బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ చల్లి నిప్పటించారని, బాలికను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరిలించామని చెప్పుకొచ్చారు. బాలికకకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఇందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఘటనకు కారణమైన నిందితులను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
కాగా, ఇటీవల బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ (అటానమస్) కాలేజీలో బీఈడీ చదువుతున్న విద్యార్థిని (20) హెచ్‌ఓడీ వేధింపులు తాళలేక క్యాంపస్‌లోనే జూన్ 12న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 90 శాతానికి పైగా గాలిన గాయాలతో 14వ తేదీ రాత్రి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరిని అరెస్టు చేసారు. యూజీసీ నిజనిర్ధారణ కమిటీ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఈ విచారణ కొనసాగుతుండగానే మరో విద్యార్థినిపై అలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.
ఇది కూడా చూడండి:IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు
Also Read : ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరలు పెరుగుదల
in-odisha | odisha-news | odisha-police | girl | fire | minor girl killed