Dharmasthala: ధర్మస్థల డెత్‌ కేసుల రికార్డుల ధ్వంసం.. పోలీసులు సస్పెండ్ !

కర్ణాటకలోని ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. 2000 నుంచి 2015 మధ్య జరిగిన గుర్తుతెలియని మృతదేహాల కేసుకు సంబంధించి కీలకమైన రికార్డులను ధ్వంసం చేసినట్లు బయటపడింది.

New Update
Dharmasthala cops under fire for wiping off 15 years of unidentified deaths records

Dharmasthala cops under fire for wiping off 15 years of unidentified deaths records

కర్ణాటకలోని ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. 2000 నుంచి 2-015 మధ్య జరిగిన గుర్తుతెలియని మ-ృతదేహాల కేసుకు సంబంధించి కీలకమైన రికార్డులను ధ్వంసం చేసినట్లు బయటపడింది. ఈ ఘటనపై ఐటీఆర్‌కు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు ఉపయోగపడే పోస్టుమార్టం రిపోర్టులు, వాల్‌ పోస్టర్లు, నోటీసులు, ఫొటోలను అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు చేసిన పనికి సామాజిక సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. క్రిమినల్‌ కేసుల రికార్డులు ధ్వంసం చేసేందుకు పోలీసులకు అధికారం లేదంటూ ధ్వజమెత్తుతున్నాయి. అయితే ఈ రికార్డులు ధ్వంసం చేసిన పోలీసులను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: 'బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ.. ఆటమ్‌ బాంబ్‌ లాంటి ఆధారాలున్నాయ్': రాహుల్ గాంధీ

కర్ణాటకలోని ప్రసిద్ధ ఆధ్యాత్రిక క్షేత్రమైన ధర్మస్థలలో అనుమానస్పద మృతదేహాలు బయట పడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్‌ విచారణ చేస్తోంది. శ్రీక్షేత్ర దగ్గర్లోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను తానే పూడ్చి పెట్టానని అప్పట్లో అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అతడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం అధికారులు కొన్ని అవశేషాలు గుర్తించారు. 13 ఏళ్ల చిన్నారి అస్థి పంజరంతో పాటు మానవులకు సంబంధించిన 15 ఎముకలు, లో దుస్తులు దొరికినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. 

Also Read: రేపే పీఎం కిసాన్.. ఈ పని చేయకపోతే డబ్బులు రావు.. అన్నదాతలకు అలర్ట్!

పారిశుద్ధ్య కార్మికుడిని గత సోమవారం సిట్‌ అధికారులు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. నేత్రావతి నది స్నాన ఘట్టానికి సమీపంలో ఈ దర్యాప్తు ప్రారంభించారు. అతడు 13 చోట్ల మృతదేహాలు పూడ్చిన ప్రాంతాలు చూపించగా.. అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం ఆరో ప్రాంతంలో మానవ అవశేషాలను గుర్తించారు. వాటిని సేకరించిన ఫోరెన్సిక్ టీమ్‌ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించింది. ల్యాబ్‌లో పరీక్షలు చేసిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలు బయటపడుతాయని సిట్‌ అధికారులు చెప్పారు.    

Also Read: పాక్, బంగ్లాపై ట్రంప్ టారిఫ్‌ మినహాయింపు.. భారత్‌పై అమెరికా కుట్ర!

Advertisment
తాజా కథనాలు