Fake 500 Note: నకిలీ రూ.500 నోటును ఈజీగా గుర్తించండిలా..!

రూ.500 నోటు నకిలీనా, అసలైనదా అని ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ నోటుపై సెక్యూరిటీ థ్రెడ్ ఒక నిలువు గీత (ఆకుపచ్చ కలర్‌లో) ఉంటుంది. దాన్ని వంచినపుడు థిక్ బ్లూ కలర్‌లోకి మారుతుంది. అలా మారకపోతే అది నకిలీ నోటు అని అర్థం. దీంతో పాటు మరికొన్ని పరిశీలించాలి.

New Update
500 note

గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత.. రూ.500 కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో నకిలీ నోట్లు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఈ నకిలీ నోట్లను గుర్తు పట్టడం చాలా మందికి తెలియదు. దీంతో మోసపోతారు. ఇప్పుడు ఎక్కువగా రూ.500 కొత్త కరెన్సీ నోట్ల మాదిరిగానే నకిలీ నోట్లు మార్కెట్‌లో చెలామనీ అవుతున్నాయి. 

Also Read : పంత్‌కు రూ.27 కోట్లు కాదు రూ.15 కోట్లే.. ఎలాగంటే!

మరి వీటిని గుర్తించడం ఎలా? అని చాలా మంది అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. మరి మీరు కూడా చాలా సార్లు నకిలీ నోట్ల బారిన పడి ఉంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. దొంగ నోట్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

నకిలీ నోటును గుర్తించడం ఎలా?

సాధారణంగా 500 రూపాయల నోటు అసలైనదో లేక నకిలీదో తెలుసుకునేందుకు కొన్ని పరిశీలించాల్సి ఉంటుంది. 

Also Read: నన్ను అరెస్టు చేయాలని చూస్తే.. RGV షాకింగ్ ట్వీట్

ముందుగా రూ.500 కరెన్సీ నోటులోని సెక్యూరిటీ థ్రెడ్ ఒక నిలువు గీత (ఆకుపచ్చ కలర్‌లో) ఉంటుంది. 

నోటులో ఆ గీత వంచి చూసినపుడు థిక్ బ్లూ (ముదురు నీలం) కలర్‌లోకి మారుతుంది. ఒక అలా చేసినపుడు మారకపోతే అది నకిలీ నోటు అని అర్థం. 

Also Read: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

అంతేకాకుండా కరెన్సీ నోటు మీద చిన్న పరిమాణంలో హిందీ, ఇంగ్లీష్ భాషలో అక్షరాలు ముద్రించి ఉంటాయి. అది కూడా గమనించి చూసుకోవాలి. 

అలాగే కరెన్సీ నోటు ముద్రించే కాగితం సాధారణ పేపర్ కాదని అందరికీ తెలిసింది. కాబట్టి ఈ నోటును తడిపినా మామూలు పేపర్‌లా చిరగదు. ఒకవేళ చిరిగిందంటే అది నకిలీ నోటుగా పరిగనించాలి. 

అలాగే కరెన్సీ నోటును ఖాళీ ప్రదేశంలో వెలుతురు ఉండే ప్రాంతంలో కుడి వైపు, ఎడమ వైపు చూస్తే.. గాంధీ ఫొటో, అలాగే అంకెలతో నోటు విలువ సంఖ్య వాటర్ మార్క్ ఉంటుంది. అలా లేకపోతే అది ఫేక్ నోటు.

ఇవి మాత్రమే కాకుండా నోటు వెనుక వైపు ముద్రించిన సంవత్సరం ఉంటుంది. అలాగే స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. స్లోగన్, రెడ్ ఫోర్ట్, లాంగ్వేజ్ ప్యానెల్ వంటివి గమనించాలి.

Also Read: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!

ఇంకా కరెన్సీ నోటీ మీద గాంధీ ఫోటో ఉండే వైపు.. ఎడమ, కుడి చివర్లలో క్రాస్‌గా ఐదు చిన్న గీతలు ఉండటం అందరూ గమనించే ఉంటారు. వాటిని వేళ్లతో తడిమి చూస్తే అవి ఉబ్బెత్తుగా ఉంటాయి. 

ఇవి మాత్రమే కాకుండా నోటును కుడివైపు వెలుతురుకు పెట్టి చూస్తే లోపల కూడా గాంధీ ఫొటో కనిపిస్తుంది.

అలాగే రూ.500 నోటుపై రూ.500 నంబర్ దేవనాగరి లిపిలో ఉంటుంది. అంతేకాకుండా నోటుపై అశోక చిహ్నం ఉంటుంది. లేదంటే చాలా డబ్బులు మోసపోవల్సి ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు