Rishabh Pant: పంత్‌కు రూ.27 కోట్లు కాదు రూ.15 కోట్లే.. ఎలాగంటే! ఐపీఎల్ 2025 వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో దక్కించుకుంది. అయితే అంత మొత్తం పంత్‌కు రాదు. 30శాతం టాక్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాక్స్, సర్‌ఛార్జీ కలుపుకుంటే రూ.11.48 కోట్లకుపైనే ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. దీంతో పంత్ చేతికి రూ.15.52 కోట్లు అందుతాయి. By Seetha Ram 28 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఐపీఎల్ 2025 మెగా వేలం ఇటీవల అట్టహాసంగా ముగిసింది. ఈ వేలంలో టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ భారీ ధర పలికాడు. కని విని ఎరుగని రీతిలో అతడు అమ్ముడుపోయాడు. తొలిరోజు లక్నో సూపర్ జెయింట్స్ దాదాపు రూ.27 కోట్లకు పంత్‌ను దక్కించుకుంది. దీంతో లీగ్ వేలం చరిత్రలో పంత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా? పంత్ చేతికి ఎంత అందుతుంది? అయితే తాజా సమాచారం ప్రకారం.. పంత్ ఐపీఎల్ వేలంలో రూ.27 కోట్లు పలికినప్పటికీ.. అతడి చేతికి మాత్రం అంత మొత్తం అందదని తెలుస్తోంది. వివిధ పన్నుల కారణంగా తక్కువ మొత్తంలోనే అందుతుందని తెలుస్తోంది. పంత్ రూ.27 కోట్ల ఐపీఎల్ వేతనంపై 30 శాతం (రూ.8.06 కోట్లు) ఆదాయపు పన్ను వసూలు చేస్తారు. మిగిలేది రూ.18.94 కోట్లు మాత్రమే. ఇది మాత్రమే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాక్స్, సర్‌ఛార్జీ ఇలా కలుపుకుంటే మొత్తం రూ.11.48 కోట్లకుపైనే ప్రభుత్వ ఖజానాకు చేరుతాయి. Also Read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్ దీంతో పంత్ చేతికి కేవలం రూ.15.52 కోట్లు మాత్రమే అందుతాయిని తెలుస్తోంది. అయితే ప్రయాణ ఖర్చులు, మేనేజర్ ఫీజు, ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లు, అకామిడేషన్, అకౌంటింగ్, ఇతర ఖర్చులను చూపిస్తే.. పంత్ చేతికి వచ్చే మొత్తం పెరిగే అవకాశం ఉంది. అలాగే సర్‌ఛార్జీలు లేకుండా కేవలం 30 శాతం టాక్స్ మాత్రమే కడితే.. పంత్ చేతికి రూ.18.94 కోట్లు వస్తాయి. Also Read:ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ! ఇది కాకుండా ఐపీఎల్ సమయంలో పంత్ గాయపడితే.. అతడికి పూర్తి వేతనం అందిస్తారు. అయితే టోర్నీకి ముందే గాయపడి మ్యాచ్‌లు ఆడలేకపోతే పంత్‌కు బదులు వేరొక ప్లేయర్‌ను ఫ్రాంచైజీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. టోర్నీకి ముందు గాయపడిన ఆటగాళ్లకు ఎలాంటి పరిహారం అందించరు. Also Read: అఖిల్ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు! #ipl-2025 #rishabh-pant #cricketer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి