Sankranti 2025 Special Trains: చర్లపల్లి To వైజాగ్ మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. రిజర్వేషన్ లేకుండానే ప్రయాణం!

సౌత్ సెంట్రల్ రైల్వే మరికొన్ని ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసింది. జనవరి 11 నుంచి ఈ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.

New Update
Sankranti 2025 special trains LIST

Sankranti 2025 special trains LIST

సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు తమ ఊళ్లకు వెళ్లేందుకు తండోపతండాలుగా రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. కానీ ట్రైన్స్ ఎక్కువగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది. 

Also Read: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్‌ భార్య

అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను

ఇప్పటికి పదుల సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి. అయినా ప్రయాణికుల రద్దీ తగ్గలేదు. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) చర్లపల్లి - విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను నడుపుతుంది. 

Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ

Train No - 08534 చర్లపల్లి - విశాఖపట్నం (జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 11, 13, 16, 18 తేదీలలో ప్రయాణిస్తాయి. 

చర్లపల్లి నుండి ఉదయం 00.30 గంటలకు (ఉదయం 12.30 గంటలకు) బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 2.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

Train No - 08533 విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 10, 12, 15, 17 తేదీలలో ప్రయాణిస్తుంది. 

Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా

విశాఖపట్నం నుండి ఉదయం 09.45 గంటలకు బయలుదేరి అదే రోజు 
రాత్రి 22.30 గంటలకు చేరుకుంటుంది.

ఈ రెండు స్పెషల్ రైళ్లు రెండు వైపులా దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట్, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ  స్టేషన్లలో ఆగుతాయి. 

Train No - 08538 చర్లపల్లి - విశాఖపట్నం (జనసాధరణ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 11, 12, 16 & 17 తేదీలలో నడుస్తాయి. 

చర్లపల్లి నుండి 10.00 గంటలకు బయలుదేరి అదే రోజు 22.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

Train No - 08537 విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధరణ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 10, 11, 15 & 16 తేదీలలో నడుస్తాయి. 

Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

విశాఖపట్నం నుండి 18.20 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు 08.00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు రెండు వైపులా దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

ఈ జనసాధరన్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులను సులభతరం చేయడానికి అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను కలిగి ఉంటాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు