Sankranthi: మొదలైన సంక్రాంతి సందడి.. హైదరాబాద్- విజయవాడ రహదారిపై రద్దీ..

సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. నగరంలో ఉండే ప్రజలు సొంతూర్లకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర రద్దీ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Traffic

Traffic

సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. నగరంలో ఉండే ప్రజలు సొంతూర్లకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర రద్దీ నెలకొంది. చాలాదూరం వరకు వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పిల్లలతో కలిసి కటుంబ సభ్యులు  తమ కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరారు.  

Also Read: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. అభ‌య‌హ‌స్తం ప‌థ‌కంపై కీలక నిర్ణయం!

అందుకే ఒక్కసారిగా వేలాది వాహనాలు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తున్నాయి. ఇక చౌటుప్పల్ పట్టణంలోని ఫ్లైఓవర్‌ లేకపోవడం వల్ల స్థానిక పాదచారులు, ద్విచక్ర వాహనాదారులు రోడ్డు దాటే సమయంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే పంతంగి టోల్‌ప్లాజా వద్ద కూడా కొన్ని నిమిషాల వరకు వాహనాలు ఆగిపోనున్నాయి. 

Also Read: రాహుల్‌గాంధీకి బిగ్‌ రిలీఫ్.. పరువు నష్టం కేసులో బెయిల్

మరోవైపు ఈ టోల్‌ ప్లాజా వద్ద విజయవాడ వైపునకు 8 టోల్‌ప్లాజాలు తెరిచి ఉంటాయి. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా అదనంగా మరో రెండు బూత్‌లను తెరిచి ఉంచారు. దీనివల్ల ఒక్కో వాహనం కొద్ది సేపట్లోనే టోల్‌ప్లాజాను దాటి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చౌటుప్పల్ పట్టణంలో, పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఏకంగా 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ప్రయాణికులకు ఆలస్యం కాకుండా, ఎలాంటి అంతరాయాలు జరకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.  

Also Read: ‘స్క్విడ్‌గేమ్‌’ సూట్‌లో టాప్ పొలిటికల్ లీడర్స్.. వీడియో వైరల్

Also Read: మరోసారి ఆ సాధువును కలిసిన విరుష్క జోడీ.. మళ్లీ అదే కారణమట!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు