Global Warming: గత కొన్నేళ్లుగా గ్లోబల్ వార్మింగ్ పెరగుతూ వస్తోంది. దీని ప్రభావం వల్ల ప్రస్తుతం అనేక దేశాలు వరదలు, కరవు లాంటి ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొంటున్నాయి. దీనికి సంబంధించి కోపర్నికస్ క్లైమెట్ చేంజ్ సర్వీస్ (C3S) కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2024 అత్యంత వేడి ఏడాదిగా నమోదైనట్లు పేర్కొంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత.. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ (1850-1900) నాటికి ఎంత ఉందో దానికి మించి 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా పెరిగినట్లు తెలిపింది. Also Read: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్! ఇక వివరాల్లోకి వెళ్తే.. కోపర్నికస్ క్లైమెట్ చేంజ్ సర్వీస్ (C3S)ను యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్(ECMWF) నేతృత్వంలో యూరోపియన్ కమిషన్ తరఫున తీసుకొచ్చారు. ఇందులో పనిచేసే శాస్త్రవేత్తలు 2024 ఏడాదికి సంబంధించి రోజూవారిగా, నెలవారిగా, అలాగే వార్షిక ఉష్ణోగ్రతల రికార్డులను పర్యవేక్షించారు. ECMWF, NASA, NOAA, ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తదితర సంస్థలు 2024లో ప్రపంచ వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడంలో భాగస్వాములుగా ఉన్నాయి. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, ఎల్‌నీనో ప్రభావం వల్ల వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో 2024లో ఉష్ణో్గ్రతలు పెరిగిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Also Read: యూపీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య Temperature Status Also Read: "స్క్విడ్‌గేమ్" సూట్‌లో టాప్ పొలిటికల్ లీడర్స్.. వీడియో వైరల్ కోపర్నికస్ క్లైమెట్ చేంజ్ సర్వీస్ డైరెక్టర్ 'కార్లో బ్యూంటేపో' ఈ అంశంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''1850 నుంచి చూసుకుంటే 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి ఏడాదిగా నమోదైంది. మనుషుల భవిష్యత్తుకి వారే ఇంఛార్జ్ లాంటి వారు. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మనం తీసుకునే వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యల వల్ల మన భవిష్యత్తులో రాబోయే వాతావరణ మార్పులను మార్చవచ్చని'' తెలిపారు. క్లైమెట్, ECMWFకి వ్యూహాత్మక నాయకుడిగా వ్యవహరిస్తున్న సమంత బర్గీస్ కూడా దీనిపై స్పందించారు. '' గత దశాబ్ద కాలంలో చూసుకుంటే పదేళ్లు కూడా వేడి సంవత్సరాలుగా రికార్డయ్యాయి. 2015 ప్యారీస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకూడదనే ఒప్పందం పెట్టుకున్నాం. కానీ గత రెండేళ్లలో చూసుకుంటే ఈ స్థాయి ఉష్ణోగ్రతను దాటేశాము. 2024లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హీట్‌వేవ్స్, వరదలు లాంటి పరిస్థితులు తలెత్తాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని'' వివరించారు. Temperature Also Read: Canada ప్రధాని రేసులో నేను కూడా ఉన్నా: భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య మరిన్ని కీలక విషయాలు 1. ప్రస్తుతం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.10 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది 1991-2020 నాటి కాలం కంటే 0.72 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ. అలాగే 2023 సగటు నాటి స్థాయి కన్నా 0.12 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ (1850-1900) కాలం నాటి స్థాయి కన్నా 1.60 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. 2. 2024లో ఉష్ణోగ్రతలు మొదటిసారిగా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ (1850-1900) కాలం నాటి స్థాయి కన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. 3. గత దశాబ్దంలో చూసుకుంటే 2015 నుంచి 2024 వరకు అన్ని కూడా వేడి సంవత్సరాలుగా రికార్డయ్యాయి. 4. 2024లో చూసుకుంటే 11 నెలల్లో కూడా నెలవారి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ దాటింది. అంతకుమందు చూసుకుంటే 2023లో జులై నుంచి అన్ని నెలలు కూడా, 2024 జులై మినహాయించి నెలవారి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. 5. 2024 జులై 22న రోజువారి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.16 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇంతటి స్థాయిలో పెరిగి అత్యంత ఉష్ణోగ్రత రోజుగా జులై 22 రికార్డు సృష్టించింది. 6. 2024 అనేది అంటార్కిటికా, ఆస్ట్రేలియా తప్ప మిగతా అన్ని ఖండాలకు కూడా వేడి సంవత్సరమే.