/rtv/media/media_files/2025/01/12/gpR5mMe7VIoenaRS4qPr.jpg)
Game Changer Piracy Photograph: (Game Changer Piracy)
రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ తో దూసుకుపోతుంది. శంకర్ ఇండియన్ 2 ప్లాప్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు. అంచనాలకు తగ్గట్టుగానే మూవీకి మిక్సుడ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా సో సోగానే వచ్చాయి. ఈ చిత్రం తొలి రోజే రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకంటించింది.
అయితే రిలీజైన రెండో రోజుకే ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. సినిమాను పైరసీ బూతం వెంటాడింది. హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది. దీంతో అంతా షాక్ అయిపోయారు. తమిళ్‌రాకర్స్, మూవీరూల్స్, ఫిల్మీజిల్లా, టెలిగ్రాం,ఐబోమ్మ లాంటి వెబ్ సైట్లలో ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇప్పుడు ఆ ప్రింట్ సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం బస్సుల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Guys Piracy is too Worst... already Hd Print Leak ayyindi.. please slove this ASAP
— Telugu flick Official (@Teluguflick_off) January 10, 2025
DM and Rt for link#GameChanager#RamCharan#Piracypic.twitter.com/EKhRynvnrr
గేమ్ ఛేంజర్ గురించి
గేమ్ ఛేంజర్‌లో రామ్ రామ్ నందన్ అనే IAS అధికారిగా అప్పన్న అనే పాత్రలో నటించాడు. కియారా దీపికగా నటించగా, అంజలి పార్వతి అనే పాత్రలో కనిపించింది. సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా తమన్ సంగీతాన్ని అందించారు.
తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్
'గేమ్ ఛేంజర్' మూవీ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రిలీజ్ కు ముందు అనుమతిచ్చిన స్పెషల్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా?