/rtv/media/media_files/2025/10/24/delhi-police-arrest-two-suspected-terrorists-planning-suicide-attacks-2025-10-24-18-47-50.jpg)
Delhi Police Arrest Two Suspected Terrorists Planning Suicide Attacks
ఢిల్లీలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్న. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారు. కానీ పోలీసులు ఆ దాడిని భగ్నం చేశారు. ISIS తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఢిల్లీలోని సాదిక్ నగర్, భోపాల్ ప్రాంతాల్లో అక్కడి సూపర్ సెల్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే ఆత్మాహుతి దాడులు చేసేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
Also Read: కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో మరో యాక్సిడెంట్.,. బోల్తా పడ్డ క్రేన్.. VIDEO
వీళ్లలో ఒకడు భోపాల్‌కు, మరొకడు మధ్యప్రదేశ్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఈ నిందితులకు ISISతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ అధికారి చెప్పారు. ఢిల్లీలో ఓ పెద్ద ఆత్మాహుతి దాడి చేసేందుకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు. వాళ్ల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రసుతం వాళ్లపై విచారణ జరుగుతోందని తెలిపారు. వీళ్ల నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
Two suspected terrorists caught by the #Delhi Police Special Cell sent to Delhi's Patiala House Court#TheRealTalkinpic.twitter.com/RrPLoLBiBc
— Tʜᴇ Rᴇᴀʟ Tᴀʟᴋ (@Therealtalkin) October 24, 2025
Also Read: అయ్యో అనూష.. బస్సు ప్రమాదంలో యాదాద్రి యువతి.. కన్నీటి కథ!
Follow Us