BREAKING: కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో మరో యాక్సిడెంట్.,. బోల్తా పడ్డ క్రేన్.. VIDEO

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ మరో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై కాలిపోయిన బస్సును క్రేన్‌ సాయంతో రోడ్డు మీద నుంచి పక్కకు తొలగిస్తుండగా ఒక్కసారిగా క్రేన్‌ బోల్తా పడింది.

New Update
crane accident

crane accident

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఘటనాస్థలంలో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ మరో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై కాలిపోయిన బస్సును క్రేన్‌ సాయంతో రోడ్డు మీద నుంచి పక్కకు తొలగిస్తుండగా ఒక్కసారిగా క్రేన్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని అక్కడున్న వాళ్లు ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగిస్తుండగానే మరో ప్రమాదం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే చెప్పాల్సిందే.. కేంద్రం IT చట్టంలో మార్పులు!

ఇదిలాఉండగా శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు కర్నూల్‌ జిల్లా చిన్నటేకూరు వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ బస్సును బైక్ ఢీకొనడంతో డిజిట్ ట్యాంకుకు మంటలు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బైకర్‌తో సహా 20 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
మృతుల కుటుంబాలకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రూ.5 లక్షల పరిహారం ప్రకటించాయి. అలాగే ప్రధాని మోదీ కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 పరిహారం ప్రకటించారు. 

Also Read: భారీగా నామినేషన్ల ఉప సంహరణ.. జూబ్లీహిల్స్ పోటీలో మిగిలింది వీళ్లే!

Advertisment
తాజా కథనాలు