/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
Delhi CM Announces Rs 10 Lakh Ex Gratia
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు(Delhi Bomb Blast) ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదం వల్ల శాశ్వతంగా దివ్యాంగులుగా మారిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయాలపాలైన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Also Read : బీహార్ ఎగ్జిట్ పోల్స్ విడుదలు.. ఆ పార్టీదే అధికారం
ఇదిలాఉండగా ఢిల్లీలో జరిగిన బాంబు దాడి ఘటన దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. మరోవైపు కేంద్ర హోం శాఖ.. ఈ బాంబు దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి వివరాలు బయటికి రానున్నాయి. ఇది ముమ్మాటికి ఉగ్రకుట్రనేనని ప్రాథమిక దర్యాప్తులో తేలిపోయింది. అయితే ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ దాడిపై తాజాగా స్పందించిన ప్రధాని మోదీ.. ఈ దాడికి పాల్పడ్డ నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు.
Also Read : అయ్యో పాపం.. IAS అధికారిణికి భర్త వేధింపులు..
Follow Us