/rtv/media/media_files/2025/12/10/deepavali-2025-12-10-13-41-27.jpg)
Deepavali inscribed on UNESCO’S Intangible Cultural Heritage list
దీపావళి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ వేడుకను దీపాల వెలుగులు, బాణాసంచాల చప్పుళ్లతో ఘనంగా జరుపుకుంటారు. దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ పండుగకు తాజాగా యునెస్కో నుంచి అరుదైన గౌరవం దక్కింది. యునెన్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చారు. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది.
దీపావళితో పాటు భారత్‌కు చెందిన 15 అంశాలు కూడా గతంలో యునెస్కో వారసత్వ గుర్తింపును పొందాయి. ఇందులో కంభమేళా, వేద పఠన సంప్రదాయం, రామ్‌లీల, యోగా, కోల్‌కతా దుర్గా పూజ, గర్బా నృత్యం వంటివి ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని యునెస్కో ప్రతినిధులు తెలిపారు. ఇదిలాఉండగా యూనెస్కో 20వ సదస్సు డిసెంబర్ 13 వరకు ఢిల్లీలోని ఎర్రకోటలో జరగనుంది. అయితే యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మీటింగ్ మాత్రం భారత్‌లో జరగడం ఇదే మొదటిసారి. యునెస్కో గుర్తింపు కోసం 80 దేశాలు ఇచ్చిన ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది.
దీపావళికి ఎందుకు గుర్తింపు వచ్చింది ?
దీపావళిని "అంధకారంపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయాన్ని" సూచించే సందేశాన్ని కలిగి ఉందని యునెస్కో పేర్కొంది. ఈ క్రమంలోనే అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో ఈ పండుగను చేర్చింది. అమూర్త వారసత్వం అంటే భవనాలు లేదా కట్టడాలు కాకుండా తరతరాలుగా ప్రజలు పాటిస్తున్న ఆచారాలు, పండుగలు, కళలు, నైపుణ్యాలు వంటి వాటిని ఈ జాబితా సూచిస్తుంది. గతంలో ఈ జాబితాలో యోగా, కుంభమేళా, దుర్గా పూజ వంటిని చేర్చారు.
దీపావళి ఆచారాలు, పాటలు, కథలను తరతరాల నుంచి పాటిస్తున్నారు. ఇది కేవలం ఒకరోజు పండుగ మాత్రమే కాదు. ఇళ్లను శుభ్రం చేయడం, దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడం, లక్ష్మీ పూజ చేయడం వంటివి పాటిస్తున్నారు. ఇలాంటి సంప్రదాయ పరిపక్షణకు యునెస్కో ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుంది.
ఆ అంశాలే ప్రధానం
వాస్తవానికి యునెస్కో ఒక వారసత్వ అంశాన్ని గుర్తించేటప్పుడు పలు అంశాలను ప్రమాణికంగా తీసుకుంటుంది. అది మానవ అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందా, సాంస్కృతిక వైవిధ్యాన్ని పెంచుతుందా, ప్రపంచం పట్ల పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుందా అనే అంశాలను ముఖ్యంగా పరిశీలిస్తుంది. అయితే ఈ ప్రమాణాలన్నీ దీపావళి పండుగలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ పండుగకు యునెస్కో నుంచి అరుదైన గుర్తింపు తెచ్చింది.
Also Read: పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. సింధు దేశం కావాలంటూ రోడ్లపై నిరసనలు
యునెస్కో నుంచి ఏదైనా గుర్తింపు పొందితే దానికి ప్రత్యేకతను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. ఆ సాంస్కృతిక పరిరక్షణ, భద్రత కోసం యునెస్కో నుంచి లేదా అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు, సాంకేతిక సాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ గుర్తింపు దేశీయంగా అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఆ సంస్కృతి పట్ల అవగాహన, గౌరవాన్ని పెంచుతుంది. అంతేకాదు యునెస్కో నుంచి గుర్తింపు పొందిన ప్రదేశాలు లేదా ఉత్సవాలు అంతర్జాతీయ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అక్కడ టూరిజం కూడా ఎంతో అభివృద్ధి అవుతుంది.
Follow Us