/rtv/media/media_files/2025/12/10/sindhudesh-demand-has-sparked-violence-in-karachi-know-details-2025-12-10-13-10-38.jpg)
Sindhudesh demand has sparked violence in Karachi know details
పాకిస్థాన్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే తమకు స్వతంత్ర దేశం కావాలని బలూచిస్థాన్ గత కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాక్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పుడు సింధు ప్రావిన్స్‌లో ఉన్నవాళ్లు కూడా తమకు ప్రత్యేక సిందూదేశం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం కరాచీలో దీనిపై జరిగిన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే సింధీ కల్చర్ డే సందర్భంగా ఆదివారం కరాచీలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ప్రత్యేక సింధూ దేశం కావాలంటూ డిమాండ్ చేశారు.
జియే సింధ్ ముత్తాహిదా మహాజ్ (JSSM) అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. ఆజాదీ, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. సింధూ ప్రాంతానికి స్వేచ్ఛ కావాలంటూ పిలుపునిచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే 1947లో దేశ విభజన తర్వాత సింధూ నదికి సమీపంలో ఉన్న సింధ్ ప్రావిన్స్ ప్రాంతం పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్కడ సొంత దేశం కావాలని నిరసనలు చెలరేగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనలో 25 మంది నిరసనాకారులను పోలీసులు అరెస్టు చేశారు. మరో అయిదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీస్ వాహనాలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
#BREAKING
— TRIDENT (@TridentxIN) December 8, 2025
Mass protests in Karachi demanding Sindhudesh.
The truth is simple: Sindh was never truly Pakistan.
It’s part of the same civilizational fold as Bharat ,history proves it every time.#FreeSindh#SindhudeshMovementpic.twitter.com/6IhwZMHSGT
Also Read: పాకిస్థాన్‌లో మైనారిటీలపై హింస.. పాస్టర్‌ను హత్య చేసిన దుండగులు..
సింధుదేశ్ వివాదం ఏంటి ?
సింధూదేశం కావాలనే డిమాండ్ ఇప్పుడు పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గతవారం అక్కడి న్యూస్ ఛానల్‌లో ఓ చర్చ జరిగింది. అందులో ఓ జర్నలిస్టు, నిపుణుడు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముత్తాహిదా క్వామి మూమెంట్ (MQM) చీఫ్ అల్తఫ్ హుస్సైన్.. 18వ సవరణ ఆమోదం పొందాక సింధ్ హోం మంత్రి జుల్ఫికార్ మిర్జాకు సింధుదేశ్ మన చేతుల్లోనే ఉందని చెప్పినట్లు గుర్తుచేశారు. అంతేకాదు ఇటీవల భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సింధూ ప్రాంతం ఎప్పటికైనా ఓరోజు భారత్‌లో కలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా భారత్‌లో సింధూ ప్రాంతాన్ని కలపాలని వాదించేందకు అక్కడ పెద్దగా రాజకీయ ఉద్యమం లేదు. కానీ అక్కడున్న పలు సంస్థలు సింధు ప్రాంతానికి స్వయంప్రతిపత్తిగా లేదా స్వతంత్ర్య సింధుదేశంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. బ్రిటిష్ వాళ్ల పాలనలో సింధూ ప్రాంతం ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉండేది. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌లో ఈ ప్రాంతం కలిసిపోయింది. 1967లో మొదటిసారిగా సింధుదేశ్ కావాలనే డిమాండ్ వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ పాక్ నుంచి విడిపోయిన తర్వాత కూడా ఈ ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. సింధూ నాగరకతతో ఇక్కడ ప్రజలకు చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. 1952లో జరిగిన బెంగాల్ భాషా ఉద్యమం స్పూర్తితోనే ఈ సింధూదేశ్ ఉద్యమం మొదలైంది.
Also Read: అమెరికా వెళ్లేవారికి బిగ్ షాక్.. హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా
గత కొన్నేళ్లుగా సింధూ ప్రావిన్సులో రాజకీయ అణిచివేత, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని JSSM లాంటి పలు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు జేఎస్ఎస్‌ఎం ఛైర్‌పర్సన్ షాఫీ బుర్ఫాత్ కూడా తమ ప్రాంతంపై జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితిని కోరారు. సింధూ ప్రాంతాన్ని స్వతంత్ర్య దేశంగా ఏర్పాడు చేయాలని అభ్యర్థించారు. మరి ఈ ఉద్యమం ఎక్కడివరకు దారి తీస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Follow Us