/rtv/media/media_files/2025/08/19/crpf-2025-08-19-18-58-16.jpg)
CRPF alerts all units, staff against fake app targeting sensitive info about troopers
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్ యాప్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉన్నట్లు చెప్పింది. సిబ్బంది వ్యక్తిగత, సంస్థాగత వివరాలు సేకరిండం వల్ల భద్రతాపరంగా ముప్పు కలిగించే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరించింది. ఆ యాప్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని 3.25 లక్షల మంది సిబ్బందికి సూచనలు చేసింది. 'సంభవ్ అప్లికేషన్ రైటర్' అనే పేరుతో ఓ యాప్‌పై వాట్సప్, యూట్యూబ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో కూడా ప్రచారం జరుగుతున్నట్లు CRPF ఐటీ విభాగం వెల్లడించింది.
Also Read: మీరు మారరారా ?.. భారతీయ యువతులపై పాకిస్థానీయుల చిల్లర చేష్టలు
అయితే ఆ యాప్‌ను తాము రూపొందించలేమని.. అసలు వాడేందుకు కూడా సిఫార్సు చేయలేదని ఓ అధికారి స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ప్లే స్టోర్‌ల నుంచి దాన్ని వెంటనే తొలగించాలని ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థలను కూడా తాము కూడా కోరామని చెప్పారు.అయితే CRPF సంభవ్ పేరిట అసలైన యాప్ ప్రస్తుతం వినియోగంలోనే ఉంది. బలగాలు, ఇతర సిబ్బంది జీతాలు, వారికి సంబంధించిన సెలవులు, బదిలీలకు అర్హత వంటి వ్యక్తిగత, అడ్మినిస్ట్రేటివ్ వివరాలు పరిశీలించేందుకు వినియోగిస్తారు.
Also Read: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?
అయితే ప్రస్తుతం సంభవ్ అప్లిక్షన్ రైటర్ పేరుతో ఏ ఫేక్ యాప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని CRPF తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ యాప్ వినియోగిస్తే సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతూ వాళ్లకి సంబంధించిన వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందని తెలిపింది. అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది.
CRPF ने अपने 3.25 लाख से अधिक जवानों और अधिकारियों को बड़ा अलर्ट जारी किया है।
— PARAMILITARY HELP - CAPF (@Paramilitryhelp) August 19, 2025
बल ने चेतावनी दी है कि गूगल प्ले स्टोर और सोशल मीडिया पर मौजूद *‘संभव एप्लीकेशन राइटर’* नाम का एप पूरी तरह अनाधिकृत है और इसका इस्तेमाल करना ऑपरेशनल सिक्योरिटी के लिए गंभीर खतरा हो सकता है।
CRPF… pic.twitter.com/S1NRNBFykz