Sanchar Saathi App : ‘సంచార్‌ సాథీ’యాప్‌పై దుమారం..ప్రభుత్వం ఏమంటుందంటే?

దేశంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలను అరికట్టడానికి  కొత్తగా వచ్చే సెల్‌ఫోన్లలో సంచార్‌ సాథీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలని సెల్‌ఫోన్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

New Update
app

Sanchar Saathi App

Sanchar Saathi App : దేశంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలను అరికట్టడానికి  కొత్తగా వచ్చే సెల్‌ఫోన్లలో సంచార్‌ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయాలని సెల్‌ఫోన్ల తయారీదారి సంస్థలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశించడంతో తీవ్ర దుమారం రేపింది. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే చర్యని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే కంపెనీలు ముందుగానే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి ఇచ్చినప్పటికీ.. వినియోగదారులు అది అనవసరం అనుకుంటే డిలీట్‌ చేసుకోవచ్చని, రిజిస్టరు అయ్యాకే అది పని చేయడం ప్రారంభిస్తుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ యాప్‌ విషయంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీనిపై టెలికం మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్‌లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్‌ సాథీ యాప్‌ను అన్ని కొత్త మొబైల్‌ ఫోన్లలో డిఫాల్ట్‌గా ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయాలని ఇటీవల టెలికంశాఖ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఫోన్ల తయారీదారులు, దిగుమతిదారులు ఈ నిబంధనను తప్పకుండా పాటించాలని సూచించింది. దీన్న 90 రోజుల్లోగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ విషయమై దుమారం చెలరేగింది.

Also Read :  పాకిస్థాన్ కు గూఢచర్యం..పంజాబ్ వ్యక్తి అరెస్ట్ !

మా మాటలు వినేం చేస్తారు?  

బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంలో భాగంగా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(congress-chief-mallikarjun-kharge) వ్యాఖ్యానించారు. ‘బంధువులు, స్నేహితులతో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది అని ఆయన ప్రశ్నించారు.. ఇప్పటికే ఆదాయ పన్ను చట్టాల ద్వారా మన డిజిటల్‌ జీవితాలను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారని ఆయన ఆరోపించారు. పెగాసస్‌తో 100 మందికిపైగా రాజకీయ నాయకులు, జడ్జీలు, జర్నలిస్టులు, కేంద్ర మంత్రుల ఫోన్లను హ్యాక్‌ చేశారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. డిస్టోపియన్‌ యుగం వర్థిల్లుతోంది’ అని మల్లిఖార్జున ఖర్గే ఎక్స్‌లో విమర్శించారు. ‘సంచార్‌ సాథీ యాప్‌.. స్నూపింగ్‌ యాప్‌,అది స్పష్టమైన పరిహాసచర్య అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ అభిప్రాయపడ్డారు.  ప్రతి పౌరుడికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ తమ బంధువులకు, స్నేహితులకు సందేశాలు పంపుకొంటే వాటిని అనుమతి లేకుండా ప్రభుత్వం చూడడం తప్పు’ అని ప్రియాంకా గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ యాప్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ అంశాన్నైనా తప్పనిసరి చేయడం ఇబ్బందులకు గురి చేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ వ్యాఖ్యానించారు.

వెనక్కి తీసుకోవాలి

సంచార్‌ సాథీ యాప్‌పై నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌(aravind-kejriwal) డిమాండు చేశారు. ఇది వ్యక్తిగత గోప్యతపై దాడేనని స్పష్టం చేశారు. ఈ యాప్‌ తప్పనిసరి చేయడం వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని సీపీఎం విమర్శించింది. 

వినియోగదారులదే నిర్ణయం

సంచార్‌ సాథీ యాప్‌(Sanchar Saathi App) ను తొలగించే స్వేచ్ఛ వినియోగదారులకే ఉంటుందని టెలికంశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎవరైనా రిజిస్టరు అయితేనే అది పని చేస్తుందని, అప్పటిదాకా నిద్రాణంగా ఉంటుందని తెలిపారు. ఈ యాప్‌పై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో మంగళవారం ఆయన పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఈ యాప్‌ ద్వారా స్నూపింగ్‌గానీ, కాల్స్‌ పర్యవేక్షణగానీ జరగబోదని తేల్చి చెప్పారు. ‘ఇది ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే చర్య. దీనిని ప్రజలు వ్యతిరేకించకూడదు. వారు స్వాగతించాలి. మీరు సెల్‌ ఫోన్‌ కొంటే అందులోని ఐఎంఈఐ నంబరు అసలుదా, నకిలీదా అని తెలుసుకునే అవకాశం ఈ యాప్‌ ద్వారా లభిస్తుంది. ఇప్పటికే 1.5 కోట్ల మంది సంచార్‌ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇప్పటివరకూ 2.75 కోట్ల మోసపూరిత మొబైల్‌ కనెక్షన్లను తొలగించాం. చోరీకి గురైన 20 లక్షల ఫోన్ల లొకేషన్‌ను గుర్తించాం. అందులో 7.5 లక్షల ఫోన్లను పోగొట్టుకున్న వారికి అందజేశాం’ అని తెలిపారు.

Also Read :  కన్నడ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్..బీజేపీలోకి సీఎం సిద్ధరామయ్య..!

ఎవరి సమాచారం తీసుకోదు

సంచార్‌ సాథీ యాప్‌ ప్రధాన ఉద్దేశం సైబర్‌ నేరాల నియంత్రణ కోసం మాత్రమేనని, దీని ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరించడమన్న పరిస్థితే ఉత్పన్నం కాదని టెలికంశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. యాప్‌ విషయంలో ఎవరికీ అపోహలు అవసరం లేదని తేల్చి చెప్పారు. ‘ఏడాదిన్నరగా నేను వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని యాప్‌ రూపకల్పనలో పాలుపంచుకున్నా. దేశంలో ఏటా సైబర్‌ మోసాలు పెరుగుతున్నాయి. బాధితుల్లో అత్యధికులు వృద్ధులు, పెద్దగా చదువులేనివారే ఉంటున్నారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ యాప్‌ తీసుకొచ్చాం. ఈ యాప్‌లో మోసపూరిత నంబర్ల గురించి ఎవరైనా రిపోర్టు చేస్తే మిగతా వినియోగదారులకు రక్షణ లభించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇందులో వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ ఇండికేటర్‌ తయారుచేసి యూపీఐ ద్వారా డబ్బులు పంపేటప్పుడు ఆ నంబరుతో పొంచి ఉన్న రిస్క్‌ గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాం. ఇది అందరికీ ఉపయోగపడే యాప్‌’ అని మంత్రి వివరించారు. 

Advertisment
తాజా కథనాలు