/rtv/media/media_files/2025/12/02/fotojet-2025-12-02t132251671-2025-12-02-13-23-13.jpg)
Big twist in Kannada politics
BIG TWIST : కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ పోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న పోరాటం ఆగేలా కనిపించడం లేదు. డీకే శివకుమార్(DK Shivakumar), సిద్ధరామయ్య వర్గాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. అధిష్ఠానం చెప్పిందే తమకు అంగీకారమని ఇద్దరు నాయకులు కూడా చెప్పారు. అయితే ఈ రెండు వర్గాలలో ఎవరి బలం ఎక్కువ అనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కాగా తనను సీఎంగా తప్పిస్తారనే ప్రచారంతో సిద్ధరామయ్య(karnataka cm siddaramaiah) అలర్ట్ అయ్యారు.
ఆయన హైకమాండ్‌కు ఝలక్ ఇచ్చారు. డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇస్తే..బీజేపీలో చేరుతానంటూ సిద్దరామయ్య వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. 140 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది.కర్నాటక సీఎం సీటు వదులుకునేందుకు ఇద్దరు నేతలు సిద్ధంగా లేరు. సిద్ధరామయ్య తీరుతో కాంగ్రెస్ అధిష్టానం డైలమాలో పడింది. మీరిద్దరే తేల్చుకోవాలని హైకమాండ్ తేల్చి చెప్పింది. దీంతో ఇద్దరూ నేతలు వరుస భేటీలతో కర్నాటకలో ఉత్కంఠ రేపుతున్నారు.
Also Read : BSF: ఎల్వోసీలో ఇప్పటికీ టెర్రర్ లాంచ్ ప్యాడ్ లు, 100కు ఉగ్రవాదులు ..బీఎస్ఎఫ్
సిద్ధరామయ్యకు ముప్పేం లేదు :
అయితే ప్రస్తుతానికి సీఎం సిద్ధరామయ్య పదవికి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. కర్ణాటక రాష్టంలో ఓబీసీలదే రాజ్యమని కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసని నివేదికలు చెబుతున్నాయి ఆయనకు అహింద వర్గంతో పాటు పార్టీలోని 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీకి సభలో మొత్తం 137 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య అంగీకారం లేకుండా ముఖ్యమంత్రిని మార్చడం అనేది చాలా కష్టం.
కుల సంఘాల వార్ : కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల సమాఖ్య (KSFBCC) కాంగ్రెస్‌ను హెచ్చరించింది. రాష్ట్ర యూనిట్‌లో అంతర్గత కలహాల నేపథ్యంలో సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగించడానికి ఏ ప్రయత్నం చేసినా అది పార్టీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. మరోవైపు కర్ణాటక రాష్ట్ర వొక్కలిగ సంఘం కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటు న్న ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు అన్యాయం జరిగితే.. వారు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించింది.
తెరమీదకు పరమేశ్వర్ పేరు : ముఖ్యమంత్రిని మార్చాలని సిద్ధరామయ్య వర్గంపై ఒత్తిడి తెస్తే వారు అధిష్ఠానానికి పేర్ల జాబితాను సమర్పిస్తారని గత కొద్ది రోజులుగా మీడియా నివేదికలలో వెల్లడైంది. ఇందులో ఓ ప్రత్యామ్నాయంగా హోంమంత్రి జి.పరమేశ్వర్ పేరు ఉండవచ్చు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. సిద్ధరామయ్య వర్గం ఏ పరిస్థితులలోనూ డీకే శివకుమార్‌ను తమ బాస్‌గా అంగీకరించడానికి సిద్ధంగా లేదు.
డీకే శివకుమార్‌ను సీఎం చేయాలనే డిమాండ్ :వీటన్నింటి మధ్య వొక్కలిగ వర్గానికి చెందిన ప్రముఖ మఠం ఆదిచుంచనగిరి మఠం రంగంలోకి దిగింది. ఆదిచుంచనగిరి మఠం ప్రధాన పూజారి నిర్మలానంద నాథ స్వామి మాట్లాడుతూ.. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. రాష్ట్ర అత్యున్నత పదవిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వానికి ఆయన అల్టిమేటం కూడా ఇచ్చారు. టీవీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తాను నిరంతరం చూస్తున్నానని ఆయన అన్నారు.
బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ :కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు విషయంపై సీఎం సిద్దరామయ్య ఈ ఉదయం తన డిప్యూటీ డీకే శివకుమార్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరి మధ్య ఇది మూడోసారి నాస్తా సమావేశం . గతసారి శివకుమార్ సీఎం నివాసానికి వెళ్లగా, ఈసారి సిద్దరామయ్య తన ఉపముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు. ఆయనకు డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్ ఘనస్వాగతం పలికారు. సురేశ్ పూలగుచ్ఛం అందించి ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించగా, డీకే శివకుమార్ కరచాలనంతో ఆహ్వానించారు. అనంతరం సిద్ధరామయ్య ఆత్మీయంగా వారితో కలిసి ఇంట్లోకి వెళ్లారు.
Also Read : Govt App: ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్.. డిలేట్ కూడా చేయలేరు..
కనకపుర నాటుకోడితో విందు :సిద్ధరామయ్య, డీకే శివకుమార్, డీకే సురేష్ తో పాటు కుణిగల్ ఎమ్మెల్యే రంగనాథ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్యకు ఇష్టమైన ఇడ్లీ- నాటుకోడి పులుసు కాంబినేషన్ తో అల్పాహారం పెట్టారు. సిద్ధరామయ్యకు నాటు కోడి మాంసం అంటే ఇష్టం. నాటుకోడి కూరతో ప్రత్యేక మెనూను సిద్ధం చేయించారు. అల్పాహారంలో ఇడ్లీతో పాటు నాటు కోడి పులుసు, నాటు కోడి ఫ్రై వడ్డించారు. తన అధికారిక నివాసంలో పెంచుతున్న కనకపుర నాటు కోడిని ఇందుకోసం ఉపయోగించారు.
ప్రత్యేక ఆకర్షణగా డీకే సోదరుడు :ఈ సందర్భంగా వీరి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రత్యేకించి అధికార మార్పిడికి సంబంధించిన అరకొర వివాదాలు కూడా తొలగిపోయినట్టయింది. ఈ విందుకు డీకే సురేష్, రంగనాథ్ హాజరు కావడం అందరినీ ఆకట్టుకుంది. తన అన్న శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ముందు నుంచీ పట్టుబట్టుతూ వస్తోన్నారు సురేష్. ఆయనే ఇప్పుడు ఈ మీటింగ్ కు అటెండ్ కావడం, సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 8న ఎంపీలతో సమావేశాన్ని నిర్వహించబోతోన్నామని తెలిపారు. రైతులు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చిస్తామని అన్నారు. అధికార మార్పిడి విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. తాను త్వరలో కేసీ వేణుగోపాల్‌ను కలుస్తున్నానని సిద్ధరామయ్య చెప్పారు. డీకే సురేష్ కూడా విందులో పాల్గొన్నాడని ప్రత్యేకంగా ప్రస్తావించారు. డీకే శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. హైకమాండ్ తలచుకున్నప్పుడు.. అని సిద్ధరామయ్య నవ్వుతూ బదులిచ్చారు.
Follow Us