/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T084114.357.jpg)
Congress leader Kharge ensational allegations against Modi
BIG BREAKING: కాంగ్రెస్ నేత ఖర్గే.. మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రదాడి గురించి ప్రధాని మోదీకి 3 రోజుల ముందే తెలుసన్నారు. అందుకే మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. ప్రజల రక్షణకోసం సరైన చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఈ మేరకు నిఘా సమాచారం బలంగా ఉన్నప్పటికీ, ప్రజలను రక్షించడానికి ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఖర్గే ప్రశ్నించారు. ఇది పొరపాటా లేదా ప్రణాళికాబద్ధంగానే జరిగిందా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
PM Modi had cancelled his Kashmir tour after an intelligence report only 3 days before Pahalgam
— Ankit Mayank (@mr_mayank) May 6, 2025
Why no action was taken to secure people, despite solid intel?
Was this a mistake or planned?
— Mallikarjun Kharge 🎯 pic.twitter.com/rLPa2vOnRc
మోదీకి తెలిసినా చెప్పలేదు..
అయితే జమ్మూకశ్మీర్ కాత్రా నుంచి శ్రీనగర్ మధ్య నడిచే రైలు సర్వీసును మోదీ ప్రారంభించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఏప్రిల్ 19న జరగాల్సిన పర్యటన వాయిదా పడింది. మోదీ టూర్ క్యాన్సిల్ అయిన 3 రోజులకే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో మోదీపై ఖర్గే ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జార్ఖండ్లో పర్యటిస్తున్న ఖర్గే.. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి 3 రోజుల ముందే ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు మోదీకి సమాచారం ఇచ్చాయి. ఇంటలిజెన్స్ సూచనతోనే మోదీ పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారని విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!
ఉగ్రదాడిలో ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం ఉంది. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ దాడికి 3 రోజుల ముందే జమ్మూలో టెర్రర్ ఎటాక్ జరగొచ్చని ప్రధానికి ఇంటెలిజెన్స్ నివేదిక పంపించినట్లు నాకు సమాచారం అందింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని తెలియగానే ప్రభుత్వం ఎందుకు అలర్ట్ చేయలేదని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?
kharge | modi | pehalgam attack | telugu-news | today telugu news