ఏపీకి మోదీ సర్కార్ శుభవార్త.. తొలి విడత నిధులు విడుదల కేంద్ర ప్రభుత్వం ఏపీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాస్కి 2024-2025 ద్వారా మొదటి విడత నిధులను విడుదల చేశారు. మొదటి విడత కింద రూ.113.751 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Kusuma 27 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాస్కి 2024-2025 ద్వారా ఏపీకి మొదటి విడత నిధులను విడుదల చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ తెలిపారు. ఇతని సహాకారంతోనే నిధులు విడుదల అయినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం ఏపీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి కోసం.. ఈ సాస్కి 2024-2025లో మొదటి విడద కింద రూ.113.751 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొదట విడత నిధుల్లో 75 శాతం వినియోగించిన తర్వాత తదుపరి విడత 34 శాతం నిధులను విడుదల చేయనున్నారు. ఈ సాస్కి పథకం ద్వారా గోదావరి, గండికోటను వంటి ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ తెలిపారు. ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. ! అలాగే పర్యాటకులను ఆకర్షించే విధంగా కొన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఏపీ పర్యాటకానికి సహకరించి నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి! వచ్చే ఐదేళ్లలో ఏపీని పర్యాటక రంగంలో మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తామని.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ తెలిపారు. త్వరలో ఈ అభివృద్ధిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు #chandrababu #pm-narendra-modi #AP Tourism #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి