Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్‌ డెక్కర్‌ నే

ఏపీలో మైట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి..కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

New Update
Hyderabad metro Timings

Hyderabad metro Timings

Ap: ఏపీలో నిర్మించనున్న మెట్రో రైల్‌ ప్రాజెక్టుల పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో మాట్లాడారు. అయితే విజయవాడ, వైజాగ్ నగరాల్లో పలు ప్రాంతాల్లో రోడ్డు ఉన్న చోట డబుల్ డెక్కర్ మెట్రో ఏర్పాటు చేసే అంశంపైనా ఈ మీటింగ్‌ లో చర్చలు జరిపారు. 

Also Read: Ganja: అనకాపల్లి To రాజస్థాన్.. భారీగా పట్టుబడ్డ గంజాయి!

కోల్‌కతాలో నిర్మించినట్లు ఏపీలోనూ మెట్రో రైలు ప్రాజెక్టులు నిర్మించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో కూడా ఏపీకి మెట్రో ప్రాజెక్టు ఉందని గుర్తు చేశారు. 2017 వరకు 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునే  విధానం అమలులో లేకపోయినప్పటికీ 2017 పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తోందని సీఎం  తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుకు 100 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లించినట్లు పేర్కొన్నారు. 

Also Read: Andhra tourist killed: గోవా హోటల్‌లో ఘోరం.. ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి కొట్టి, ఆఖరికి!

కోల్‌కతా తరహాలోనే..

రూ.8,565 కోట్లతో కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించినట్లు వెల్లడించారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, రైల్వే శాఖలు సంయుక్తంగా కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాయని తెలిపారు. ఇప్పుడు కోల్‌కతా తరహాలోనే ఏపీలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంలోని మోదీ సర్కార్‌తో చర్చలు జరపాలని సీఎం అన్నారు.ఇక ఏపీ పునర్విభజన చట్టంలో కూడా ఏపీకి మెట్రో ప్రాజెక్టు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం అయినా.. లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు సాయం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. 

Also Read: Tirupati: తిరుమలలో పుష్పరాజ్‌ల హల్‌చల్.. భారీగా పట్టుబడ్డ దుంగలు!

ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇక విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నట్లు సీఎం అన్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ విధానంలో కింద రోడ్డు దాని పైన ఫ్లై ఓవర్.. ఆపైన మెట్రో రైలు వస్తుందని వివరించారు.విశాఖలో మొదటి దశలో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్ల మార్గంలో గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల పాటు డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో రైలు నిర్మాణం జరగనున్నట్లు తెలిపారు. 

Also Read: Pawan: ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవండి.. విజయవాడ బుక్ ఫెయిర్‌లో పవన్

ఇక విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.ఇప్పటికే ఈ తరహా డబుల్ డెక్కర్ మెట్రో రైలు మోడళ్లు వివిధ నగరాల్లో పరుగులు తీస్తున్నాయని సీఎం చెప్పారు. అందుకే ఏపీలో కూడా ఇలాంటి తరహా మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

రానున్న 4 ఏళ్లలో విజయవాడ, విశాఖ రెండు నగరాల్లో ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేయాలని అధికారుల కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు