/rtv/media/media_files/2025/07/29/minister-keermen-shilla-2025-07-29-11-20-17.jpg)
రాష్ట్రంలో బొగ్గు నిల్వలు ఏమ్యాయని హైకోర్టు అడిగిన ప్రశ్నకు మంత్రి ఏడు చేపల కథ చెప్పాడు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఇటీవల 4 వేల టన్నుల బొగ్గు యామమైంది. దీంతో దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈక్రమంలో రాష్ట్ర మంత్రి ఇచ్చిన వివరణ వింటే అందరూ షాక్ అవుతారు. ప్రస్తుతం ఆయన సమాధానం చర్చనీయాంశమైంది. భారీ వర్షాల కారణంగా ఆ బొగ్గు అంతా బంగ్లాదేశ్, అస్సాంకు కొట్టుకుపోయి ఉండొచ్చని మంత్రి చెప్పడం ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా మారింది. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అక్రమ మైనింగ్‌ను దాచిపెట్టేందుకే ఇలాంటి వాదనలు తీసుకొస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.
Meghalaya Minister claims rain washed away 4,000 tonnes of missing coal, as High Court orders action against negligent officials. #MeghalayaCoal#HighCourt#IllegalMining#Accountability#JusticeKatakeypic.twitter.com/YA8XgmZUV4
— Indushree Rajan (@Indushreepiku1) July 29, 2025
మేఘాలయలోని రాజాజు, దియంగన్ గ్రామాల్లో గల 2 బొగ్గు గనుల నుంచి ఇటీవల దాదాపు 4వేల టన్నుల బొగ్గు కన్పించకుండా పోయింది. దాన్ని అక్రమంగా తరలించి ఉంటారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వాన్ని మందలించింది. బొగ్గు అదృశ్యం వెనక బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కీర్మెన్ షిల్లా మాట్లాడుతూ.. జరిగినదాన్ని నేను సమర్థించడం లేదు. కానీ మనం ఓ విషయం గుర్తించాలి. మేఘాలయ దేశంలోనే అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాల్లో ఒకటి. భారీ వర్షాల కారణంగా ఏదైనా జరగొచ్చు. మేఘాలయలో వర్షాల కారణంగా పొరుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ 4వేల టన్నుల బొగ్గు కూడా వర్షానికి బంగ్లాదేశ్, అస్సాంకు కొట్టుకుపోయి ఉండొచ్చని అన్నారు.బొగ్గు నిల్వలు మాయమవ్వడంలో కేవలం వర్షాన్ని నిందించలేం. బొగ్గు అక్రమరవాణా జరిగినట్లు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాల్లేవు. సంబంధిత అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారిని చట్టం ముందుకుతీసుకొస్తామని మంత్రి కీర్మెన్ షిల్లా తెలిపారు.