/rtv/media/media_files/2025/07/10/trump-imposes-50-percent-tariffs-on-brazil-after-public-spat-with-lula-2025-07-10-13-37-23.jpg)
Trump imposes 50% tariffs on Brazil after public spat with Lula
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాకిస్థాన్ మధ్య జోక్యం చేసుకొని విమర్శలు ఎదర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన బ్రెజిల్‌తో కొత్త పంచాయితీకి దిగారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. అందుకే బ్రెజిల్‌పై 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. తమ విధానాలను వ్యతిరేకించే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తానని ఇటీవల ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియా లూలా డ సిల్వా స్పందించారు. ట్రంప్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదంటూ సెటైర్ వేశారు. ఈ క్రమంలోనే ట్రంప్ బ్రెజిల్‌పై 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే బ్రెజిల్ స్వేచ్ఛా ఎన్నికలపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. తాము ప్రతీకారం తీర్చుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ అధ్యక్షుడు లూలాను ఉద్దేశించి రాసిన లేఖలో మాజీ అధ్యక్షుడు బోల్సోనారోపై బ్రెజిల్ అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకించారు.
Also Read: యెమెన్ నర్స్ నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నం..బ్లడ్ మనీ ఒక్కటే దారి
ప్రస్తుతం ఆయనపై జరుగుతున్న విచారణ ఆపేయాలని తెలిపారు. అలాగా బ్రెజిల్ వాణిజ్య విధానాలపై అమెరికా కూడా దర్యాప్తు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ఏకపక్షంగా టారిఫ్‌లను పెంచడంతో ఆర్థిక చట్టాలకు అనుగుణంగా దీన్ని ఎదుర్కొంటామని లూలా ఎక్స్‌లో తెలిపారు.అయితే బ్రెజిల్.. కెనడా తర్వాత అమెరికాకే ఎక్కవగా ఉక్కును ఎగుమతి చేస్తోంది. గతేడాది 4 మిలియన్ టన్నుల లోహాన్ని రవాణా చేసింది.
ఇక మాజీ అధ్యక్షుడు బోల్సోనారోను సపోర్ట్ చేస్తూ బ్రెజిల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అందులో బోల్సోనారో, ఆయన కుటుంబ సభ్యులు అమెరికాకు బలమైన భాగస్వాములని పేర్కొంది. వాళ్లపై ఆయన అనుచరులపై జరుగుతున్న రాజకీయ హింస సిగ్గ చేటని.. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలను అగౌరవపరచడమేనని విమర్శలు చేసింది. అయితే దీనిపై బ్రెజిల్ సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రకటనపై విచారణకు రావాలంటూ అమెరికా రాయబారికి ఆదేశాలు జారీ చేసింది.
Also Read: చైనా డ్యామ్..భారత్ పై వాటర్ బాంబ్..అరుణాచల్ సీఎం ఆందోళన
ఇదిలాఉండగా 2020లో జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో బ్రెజిల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో ఆయన పాత్ర ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. బోల్సోనారోతో సహా మరో 33 మందిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడి సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. అయితే ఈ హింసాత్మక ఘటనల వెనక ఉన్న కుట్ర ఉన్నట్లు తేలిది.. వాళ్లకి శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది.