Flights: గాల్లో రెండు విమానాలు ఢీకొనకుండా ఎలా ప్రయాణిస్తాయో తెలుసా ?

గతంలో ప్యాసింజర్ విమానాలు గాల్లో ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరిగినప్పటికీ భారీగా ప్రాణనష్టం సంభవించింది. చివరికి సాంకేతిక మార్పులు రావడంతో ఇలాంటి ప్రమాదాలు చాలావరకు తగ్గిపోయాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Flights

Flights

గతంలో ప్యాసింజర్ విమానాలు(flights) గాల్లో ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరిగినప్పటికీ భారీగా ప్రాణనష్టం సంభవించింది. 1996, నవంబర్ 12న హర్యానాలో రెండు విమానాలు గాల్లో ఢీకొనడం సంచలనం రేపింది. ఢిల్లీ నుంచి వస్తున్న సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్, ఢిల్లీకి సమీపంలో ఉన్న కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 349 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, జర్మనీ, రష్యా తదితర దేశాల్లో గాల్లో విమానాలు ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి. చివరికి ఎయిర్‌లైన్స్‌ రంగంలో అనేక సాంకేతిక మార్పులు రావడంతో ఇలాంటి ప్రమాదాలు చాలావరకు తగ్గిపోయాయి. విమానాలు ఒకదానికొకటి గాల్లో ఢీకొనడకుండా సురక్షితంగా ప్రయాణించే పరిస్థితులు వచ్చాయి. అయితే గాల్లో రెండు విమానాలు ఎలా ఢీకొనకుండా ప్రయాణిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.      

విమాన పైలెట్లు గగనతలంలో రకరకాల విధానాలను పాటిస్తారు. రాడార్ రహిత, రాడార్ సహిత వ్యవస్థలను ఆధారంగా ఎలా ప్రయాణం చేయాలో ట్రైనింగ్ తీసుకుంటారు. దీనివల్ల విమానాలు గాల్లో ఢీకొడం చాలా కష్టం. మొదట్లో విమానం గాల్లో ఎగరడం ప్రారంభమైనప్పుడు పక్కన ఏదైనా విమానం వస్తుందా ? లేదా? అని కిటికీలో నుంచి చూసేవారు. కానీ ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  

Also Read: ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌.. డిలేట్‌ కూడా చేయలేరు..

Why Do Not Planes Crash Into Each Other

ఎయిర్‌పోర్టు(airports)కి దగ్గర్లో వచ్చిపోయే విమానాల ట్రాఫిక్ గురించి  స్టాండర్డ్ ఇన్‌స్ట్రుమెంట్‌ డిపార్చర్‌ (SID), స్టాండర్డ్‌ టెర్మినల్‌ ఎరైవల్‌ రూట్‌(స్టార్‌) ద్వారా పైలట్లు తెలుసుకుంటారు. ఏ సమయంలో ఏయే విమానాలు వస్తాయో అనేదానిపై వాళ్లకి సమాచారం ఎప్పటికప్పుడు చేరుతుంది. టేకాఫ్‌ అయ్యేందుకు ఎయిర్‌పోర్టులో పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా పైలట్లకు ఈ సమాచారం వెళ్తుంది. దీంతో వాళ్లు కొద్దిసేపు గాల్లోనే విమానాన్ని చక్కర్లు కొట్టించి కిందకి దించుతారు. 

ముఖ్యంగా విమాన స్థితిని బట్టి అవి ఎగిరే ఎత్తును నిర్ధారిస్తారు. సాధారణంగా 29 వేల అడుగుల లోపు ఎత్తులో ప్రయాణించే విమానాల మధ్య 1000 అడుగులు నిలువు దూరం పాటించాలి. ఉదాహరణకు 'A' అనే ఒక విమానం 12 వేల అడుగులు ఎత్తులో ప్రయాణిస్తే 'B' అనే మరో విమానం 13 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ 29 వేల అడుగులకన్నా ఎత్తులో ప్రయాణిస్తుంటే దూరం 2 వేల అడుగులు ఉంటుంది. ఇక 45 వేల అడుగులుకన్నా ఎత్తులో ప్రయాణిస్తే 4 వేల అడుగుల ఎత్తు దూరం పాటించాల్సి ఉంటుంది. 

అధునాతన జెట్ విమానాలను 'రెడ్యూస్ట్‌ వెర్టికల్ సెపరేషన్ మినిమా' విధానంలో 2941 వేల అడుగుల ఎత్తులో 1000 అడుగుల దూరం పాటించేందుకు పర్మిషన్ ఇస్తారు. ఇది ఇంధనాన్ని సేవ్ చేసేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే విమానాలు అడ్డంగా వేరు చేసేందుకు రెండు రూట్‌లను ఎంచుకుంటారు. రాడార్ కవర్ చేసే ప్రదేశాన్ని దూరంతో, రాడార్‌లేని ప్రదేశాన్ని సమయంతో  వేరు చేస్తారు. అయితే రాడార్ కవర్ చేసే ప్రదేశంలో రెండు విమానాలు ఒకదాని వెనుక ఇంకోటి వెంటనే వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు. ఈ విధానంలో ఒక్కో విమానానికి 5 నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటారు. రాడార్‌ కవర్ చేయని ప్రాంతంలో రెండు విమానాలు టేకాఫ్‌ అయ్యేందుకు వాటి మధ్య 10 నుంచి 15 నిమిషాల సమయం తేడా ఉంటుంది. 

Also Read: విచ్చలవిడి శృంగారం.. అడ్డు అదుపులేని లైంగిక సంబంధాలతో..ఎయిడ్స్‌ విజృంభన

ఎదురెదురుగా వచ్చే విమానాల్లో గాల్లో ఢీ కొట్టకుండా ఉండేందుకు నార్త్‌సౌత్‌ నియమాన్ని పాటిస్తారు. దీని ప్రకారం గగనతల మార్గాన్ని 360 డిగ్రీలుగా విభజించుకొని 0-179 డిగ్రీల వరకు విమానాలు ఉత్తరం నుంచి దక్షిణం దిశగా వెళ్తాయి. 180-359 డిగ్రీల మధ్య విమానాలు దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రయాణిస్తాయి. 

ఇక విమానాలు గాల్లో సేఫ్‌గా ప్రయాణం చేయడంలో  ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ (ATC) కీలక పాత్ర పోషిస్తుంది. ఆకాశంలో ఏ విమానం ఎంత ఎత్తులో వెళ్తుందో ATCకి ఎప్పటికప్పు రాడర్ల ద్వారా తెలుస్తుంది. విమానాలు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంటే 463 కిలోమీటర్ల లోపే వాటి వేగం ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ విమానం గాల్లో ఉండగా ఏదైన సమస్య వస్తే ట్రాఫిక్ అలర్ట్‌ & కొలిజన్‌ అవైడెన్స్‌ సిస్టమ్ (TCAS) పైలట్‌లను అలెర్ట్ చేస్తోంది. అన్ని విమానాల్లో కూడా ఈ సిస్టమ్ ఉంటుంది. ఇది ప్రమాదాన్ని ముందే గుర్తిస్తాయి. ఎగిరే ఎత్తు పెంచమంని ఒక పైలట్‌ను, తగ్గించమని ఇంకో పైలట్‌కు కమాండ్ ఇస్తుంది. అన్ని విమానాలకు కూడాTCAS వ్యవస్థను తప్పనిసరి చేశారు. 

Advertisment
తాజా కథనాలు