Chirag Paswan: నితీశ్‌తో ముగిసిన భేటి.. చిరాగ్ పాశ్వన్ సంచలన వ్యాఖ్యలు

శనివారం సీఎం నితీశ్‌ కుమార్‌ ఇంటికి చిరాగ్‌ పాశ్వన్‌ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు.

New Update
Chirag Paswan Key Comments after big poll win in Bihar Elections

Chirag Paswan Key Comments after big poll win in Bihar Elections

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్) చీఫ్‌ చిరాగ్ పాశ్వన్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. అయితే శనివారం సీఎం నితీశ్‌ కుమార్‌ ఇంటికి చిరాగ్‌ పాశ్వన్‌ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తన పని అయిపోయిందని అందరూ అనుకున్నారని.. కానీ ఈసారి వచ్చిన విజయం తనకు ఎంతో విలువైనదని తెలిపారు. 

Also Read: విమాన ప్రమాదంలో భారతీయురాలు మృతి.. రూ.317 కోట్ల పరిహారం

ఎన్డీయే కూటమిలో LJP, JDU పార్టీలపై అనేక అసత్యాలు ప్రచారం అయ్యాయని.. కానీ మేమందరం కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. గతంలో మాకు ఒక్క ఎమ్మెల్యే లేనప్పటికీ మాకు 29 స్థానాలను కేటాయించారని తెలిపారు. జేడీయూ, ఎల్‌జేపీపై విభేదాలు సృష్టించాలని ప్రయత్నించారని .. కానీ ఫలితాలు వాటిని తిప్పికొట్టాయని తెలిపారు.  

Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం

అంతేకాదు ఆర్జేడీ పార్టీ తమ క్రమంగా తన బలాన్ని కోల్పోతోందని.. తాజాగా వచ్చిన ఫలితాలే దాన్ని నిరూపించాయని తెలిపారు. జంగిల్‌రాజ్‌ను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. 2015, 2020లో కొన్ని పరిస్థితులు అనుకూలించడం వల్లే వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం బాధ్యతలకు ఎవరికి అప్పగిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు