Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాద సంఘటన జరిగింది. నిన్న అర్థరాత్రి మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధి 13వ వార్డులోని ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు.

New Update
bihar muzaffarpur fire accident

bihar muzaffarpur fire accident

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాద సంఘటన జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో.. అంటే నిన్న అర్థరాత్రి మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధి 13వ వార్డులోని ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు. అదే కుటుంబానికి చెందిన మరో ఐదుగురు తీవ్రగాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రిలో చేర్చారు. 

bihar muzaffarpur fire accident

ఈ ఘోరమైన అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయని డీఎస్పీ వెస్ట్రన్ సుచిత్రా కుమారి తెలిపారు. అయితే మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో ఆ కుటుంబం తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.

కొంతమంది నిద్రలోనే మరణించారని.. గాయపడిన వారిని చుట్టుపక్కల వారు, పోలీసులు రక్షించారన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు సమీపంలోని వారి సహాయంతో క్షతగాత్రులను రక్షించి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామని చెప్పారు. 

ఈ ఘటనలో గాయపడిన వారిని SKMCH ఆసుపత్రిలో చేర్చారు. మరణించిన వారిలో లాలన్ సాహ్, అతని తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేసింది. ఈ ప్రమాదంతో చుట్టూ ఉన్న ప్రజలు తమ విద్యుత్ కనెక్షన్‌లను చెక్ చేసి మార్చుకోవడానికి పరుగులు తీశారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినా, పోలీసులు ఇతర కోణాల నుండి కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు