/rtv/media/media_files/2025/12/19/seegull-2025-12-19-06-50-51.jpg)
కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని ఇండియన్ నేవీ స్థావరం(Indian Navy base) సమీపంలో చైనా జీపీఎస్ ట్రాకర్(Chinese GPS tagged)తో కూడిన సముద్రపు పక్షి కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోనే అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కదంబ నావికా స్థావరం ఉన్న కార్వార్ తీరంలో ఈ పక్షి తిరుగుతుండటంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మంగళవారం కార్వార్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ సమీపంలో ఓ వలస పక్షి (సీగల్) గాయపడి ఎగరలేని స్థితిలో ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఆ పక్షి వెనుక భాగంలో వింత పరికరం అమర్చి ఉండటంతో అనుమానం వచ్చిన వారు వెంటనే కోస్టల్ మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ పక్షిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
అటవీ శాఖ అధికారులు పక్షిని పరిశీలించగా, దాని శరీరానికి ఓ జీపీఎస్ ట్రాకింగ్ పరికరం, చిన్న సోలార్ ప్యానెల్ అమర్చి ఉన్నట్లు గుర్తించారు. ఆ ట్రాకర్‌పై చైనీస్ భాషలో ఈమెయిల్ ఐడీ ఉంది. దాన్ని పరిశీలించగా, అది చైనాలోని 'రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో-ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్' కి చెందినదిగా నిర్ధారణ అయింది. ఆ పరికరంపై "ఈ పక్షి కనిపిస్తే దయచేసి ఈ ఈమెయిల్ ఐడీకి సమాచారం ఇవ్వండి" అనే సందేశం కూడా ఉంది.
Also Read : ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు అరెస్ట్.. పోలీసుల అదుపులో యాసీర్ అహ్మద్ దార్
Chinese Spy Bird In Karnataka
Karnataka News : Chinese GPS trackers found attached to a seagull raises security concerns in Karwar. pic.twitter.com/oAT2CxUAhT
— News Arena India (@NewsArenaIndia) December 17, 2025
Also Read : మాహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు.. జి రామ్ జి బిల్లులో కీలక మార్పులు ఇవే !
ఆసియాలోనే అతిపెద్ద నావికా స్థావరంగా పేరుగాంచిన ఐఎన్ఎస్ కదంబ సమీపంలో చైనా పరికరంతో కూడిన పక్షి కనిపించడంతో ఇది గూఢచర్యానికి సంబంధించినది కావచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రాథమిక విచారణలో ఇది వలస పక్షుల కదలికలు, ఆహారపు అలవాట్లపై పరిశోధనలో భాగంగా అమర్చిన ట్రాకర్‌గా అధికారులు భావిస్తున్నారు. ఉత్తర కన్నడ ఎస్పీ దీపన్ ఎంఎన్ మాట్లాడుతూ, "ఇది వలస పక్షుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రీయ పరికరమా? లేక మరేదైనా భద్రతా ముప్పు ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఆ చైనా సంస్థను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం" అని తెలిపారు.
గతంలోనూ ఇలాగే..
గతేడాది కూడా ఇదే ప్రాంతంలో ఒక డేగకు ట్రాకింగ్ పరికరం అమర్చి ఉండటం కనిపించింది. అయితే అప్పట్లో అది వన్యప్రాణి పరిశోధనలో భాగమేనని తేలింది. ప్రస్తుతం ఈ సీగల్ పక్షి దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అధికారులు ఆ జీపీఎస్ పరికరాన్ని సాంకేతిక పరీక్షల కోసం పంపారు.
Follow Us