China-India: బలపడుతున్న బంధం.. వచ్చేవారం భారత్‌కు రానున్న చైనా విదేశాంగ మంత్రి..

చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ.. వచ్చేవారం భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్‌ ధోవల్‌తో భేటీ కానున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.

New Update
Chinese Foreign Minister Wang Yi to visit India next week for Talks with Ajit Doval

Chinese Foreign Minister Wang Yi to visit India next week for Talks with Ajit Doval

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లు 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ.. వచ్చేవారం భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్‌ ధోవల్‌తో భేటీ కానున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. చైనా, భారత్‌కు ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వాంగ్‌ యీ, అజిత్‌ ధోవల్‌ అత్యున్నత స్థాయి చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం గురించి ఆ సమావేశంలో పరిష్కరించేందుకు చర్చించనున్నట్లు తెలుస్తోంది.  

Also Read: మొన్న బెదిరింపులు.. ఈరోజు కాళ్ల బేరం.. ఇండియాని నీళ్లు అడుక్కుంటున్న పాకిస్తాన్

2020లో లడఖ్‌లోని గాల్వాయన్‌లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇరుదేశాలు దౌత్యపరంగా ఆంక్షలు విధించుకున్నాయి. అయితే తాజాగా ఈ ఆంక్షలను కూడా సడలించుకున్నాయి. భారత్‌కు చైనా నుంచి డిజిల్‌ ఎగుమతి చేయనున్నారు. 2021 తర్వాత తొలిసారిగా భారత్‌-చైనా మధ్య డీజిల్‌ షిప్‌మెంట్‌ జరగనుంది. అలాగే ఇరుదేశాల మధ్య త్వరలోనే విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ వల్ల 2020లో ఈ విమాన సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్‌కు యూరియా ఎగుమతులపై ఉన్న ఆంక్షలను సైతం చైనా సడలించింది. త్వరలో చైనా నుంచి దాదాపు 3 లక్షల టన్నుల యూరియా ఎగుమతులు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది.అలాగే  చైనా పౌరులకు టూరిస్టు విసాలపై ఉన్న ఆంక్షలను కూడా భారత్‌ తాజాగా ఎత్తివేసింది. 

Also Read: యూకేలో నీటి సంక్షోభం.. ఈమెయిల్స్‌ డిలీట్ చేయాలని కోరుతున్న ప్రభుత్వం

ఇలాంటి పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో వచ్చే వారంలో చైనా విదేశాంగ మంత్రి భారత్‌కు రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో విషయం ఏంటంటే ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1న చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SEO) సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. చైనా విదేశాంగ శాఖ ఈ సదస్సుకు మోదీకి ఆహ్వానం పలుకుతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన చేసింది.  అయితే ఈ సదస్సులో భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు పెంచుకునేలా ఇరుదేశాధినేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.  

Also Read: ధర్మస్థల కేసులో సంచలన అప్‌డేట్.. 13వ స్పాట్‌లో 8 మృతదేహలు

Advertisment
తాజా కథనాలు