Jyotiraditya Scindia : బహిరంగ సభలో I Love You అని చెప్పిన కేంద్రమంత్రి! -Video Viral

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం రోజున తన పార్లమెంటరీ నియోజకవర్గం గుణ పర్యటించారు. అశోక్ నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఒక చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

New Update
love you

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(jyotiraditya-scindia) శుక్రవారం రోజున తన పార్లమెంటరీ నియోజకవర్గం గుణ పర్యటించారు. అశోక్ నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఒక చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సభలో జ్యోతిరాదిత్య సింధియా ప్రసంగిస్తూ ఆయన వేదికపై నుండి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. సింధియా చేసిన ఈ చర్యను చాలా మంది అభినందిస్తున్నారు కూడా. 

Also Read :  Medical Student : వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం.. MBBS స్టూడెంట్ పై రేప్.. ఫోన్ లాక్కుని

ఇంతకు ఏం జరిగిందంటే 

జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం అశోక్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నప్పుడు వైరల్ అయిన వీడియో ఇది. ఒక అభిమాని "సింధియా జీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను..." అని అరిచాడు. సింధియా దీనిని చూసి నవ్వారు. ఇది విన్న వెంటనే తన ప్రసంగాన్ని ఆపి, "నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను..." అని సమాధానం ఇచ్చారు.  సింధియా అక్కడితో ఆగలేదు..  నవ్వుతూ, ఇది ప్రేమ, మన మధ్య ఉన్న సంబంధం, లేకపోతే ఏ ఇతర సంబంధం 15 తరాల వరకు ఉండదు. నేటి కాలంలో, ఒకరు ప్రేమలో పడినా, అది పది రోజులు ఉంటుంది. మా సంబంధం 15 తరాలుగా కొనసాగుతోంది. దీని గురించి ఎవరైనా ఒక గాథ రాయాలి” అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కేంద్ర మంత్రి మూడు కొత్త 33/11 kV, 5 MVA విద్యుత్ సబ్‌స్టేషన్‌లకు శంకుస్థాపన చేశారు. దీపావళికి ముందు అశోక్‌నగర్ జిల్లా వాసులకు అభివృద్ధి భాగంగా కొత్త వెలుగును బహుమతిగా ఇచ్చానని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సబ్‌స్టేషన్లు 23 గ్రామాల్లోని వేలాది కుటుంబాలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తుంది. ప్రతి గ్రామానికి వెలుగునిస్తాయి.

Also Read :  ఈ బంగారం కేవలం రూ.10 వేలే.. వెంటనే ఆ ఆభరణాలు చేయించుకోండి!

Advertisment
తాజా కథనాలు