ఫడ్నవిస్‌కు బిగ్ షాక్.. మహారాష్ట్ర సీఎంగా కేంద్రమంత్రికి ఛాన్స్

మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే తాజాగా సీఎం రేసులో కొత్తగా మురళీధర్‌ మోహోల్‌ పేరు తెరపైకి వచ్చింది. రాజకీయంగా అంతగా ప్రజాధారణ లేని మురళీధర్‌కు సీఎం పదవి అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
FADNAVIS

మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. సీఎం పదవి ప్రకటన, శాఖాల కేటాయింపు విషయాలను ఇంకా బీజేపీ హైకమాండ్ వెల్లడించలేదు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా సీఎం రేసులో కొత్తగా మురళీధర్‌ మోహోల్‌ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ ఎంపీ అయిన మురళీధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో ఈయన పుణె మేయర్‌గా కూడా పనిచేశారు. రాజకీయంగా అంతగా ప్రజాధారణ లేని మురళీధర్‌కు సీఎం పదవి అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

మరోవైపు సీఎం పదవికోసం రేసులో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శివసేన నేత సంజయ్ శిర్సాట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండేను పక్కనపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. '' షిండే నాయకత్వంలో మహాయుతి కూటమి ఏర్పాటు చేయడం వల్ల ఈ ఎన్నికల్లో బీజేపీకి లాభం జరిగింది. కొన్ని పథకాలకు ఎన్సీపీ అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా షిండే ముందుకెళ్లారు. ఈ స్కీమ్స్‌ వల్లే కూటమికి ఓట్లు వచ్చాయి. సాధారణంగా డిప్యూటీ సీఎంకే హోంశాఖను అప్పగిస్తారు.       

Also Read: మహారాష్ట్ర ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్ లో రచ్చ రచ్చ!

ఇప్పుడు బీజేపీ సీఎం పదవి తీసుకుంటే హోంశాఖను శివసేనకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇది కూడా సీఎం వద్దే ఉంచుకోవడం సరికాదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో షిండేకు కీలక శాఖలు అప్పగించకూడదని, ఆయనను పక్కకు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోందని'' సంజయ్ శిర్సాట్ చెప్పారు. 

మరోవైపు సీఎం ఎంపిక, శాఖల కూటమి విషయంలో మహాయుతి కూటమి తీసుకున్న నిర్ణయంపై షిండే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్య సమస్యలతో ఊరికి వెళ్లినట్లు కొందరు నేతలు చెబుతున్నారు. అయితే తన భవిష్యత్తు కార్యచరణపై సీఎం షిండే మరో 24 గంటల్లో కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం ధరలు తగ్గింపు!

Also Read: TG Crime: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు