మహారాష్ట్ర ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్ లో రచ్చ రచ్చ! ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమి నేపథ్యంలో ఈ రోజు జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ హాట్ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది. ఐక్యంగా లేకపోతే ఎలా గెలుస్తాం? అంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. By Nikhil 29 Nov 2024 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వాడీవేడిగా సాగింది. గెలిచే అవకాశం ఉన్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంపై తీవ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం. నేతలతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. లీడర్ల విరుద్ధ ప్రకటనలతో పార్టీకే నష్టమంటూ చురకలు అంటించరని సమాచారం. ఐక్యంగా లేకపోతే ఎలా గెలుస్తాం? ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని.. మనం ఓటర్లను ఆకర్షించలేకపోతే ఎలా? అని ఫైర్ అయ్యారు. పార్టీని బలోపేతం చేయడమే ఇప్పుడు ముఖ్యమని.. ఎన్నికలకు ఏడాది ముందే గ్రౌండ్‌లోకి దిగాలని సూచించినట్లు తెలుస్తోంది. గెలవడం కోసం కొత్త పద్ధతులు కావాలని అన్నట్లు తెలుస్తోంది. ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఓటమి.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న చర్చ సాగింది. కానీ అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. అయితే.. కాంగ్రెస్ నేతల ఓవర్ కాన్ఫిడెన్సే ఈ ఓటమికి కారణమన్నా ప్రచారం సాగింది. బీజేపీ నేతలు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పని చేస్తే.. హస్తం నాయకులు మాత్రం గెలవబోతున్నామంటూ నిర్లక్ష్యంగా ఉన్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. మహారాష్ట్రలో కూటమిలో పెదన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్.. విఫలం అయ్యిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ దారుణంగా ఓడి పోవడంతో పాటు.. ఆ ప్రభావం కూటమిపై కూడా పడిందన్న చర్చ ఉంది. कांग्रेस कार्यसमिति (CWC) की बैठक में मेरा शुरुआती वक्तव्य — कार्य समिति के सभी सदस्य साथी, आप सभी का स्वागत है।1. सबसे पहले मैं प्रियंका गांधी जी को वायनाड से और रवींद्र वसंतराव चव्हाण को नांदेड़ से लोक सभा में विजयी होने पर बहुत बधाई देता हूं। राज्यों में कांग्रेस के विजयी… pic.twitter.com/KbXqc87Z9Q — Mallikarjun Kharge (@kharge) November 29, 2024 కర్ణాటక, తెలంగాణ తరహాలో ఐదు గ్యారెంటీలను ఇస్తామని మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే.. ఈ హామీలు ఆయా రాష్ట్రాల్లో అమలు కావడం లేదంటూ బీజేపీ తీవ్రంగా ప్రచారం చేసింది. ఐదు హామీలు ప్రజల్లోకి వెళ్లకపోవడానికి ఇది కూడా ఓ కారణమన్న ప్రచారం ఉంది. అయితే.. బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు సమర్ధవంతంగా తిప్పి కొట్టలేదన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే ఖర్గే నేతలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి