Chandrayaan 3 : చంద్రమండలంపై సీక్రెట్స్ బయటపెట్టిన చంద్రయాన్ 3 మిషన్

చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడిపై తాజా వాతావరణ పరిస్థితులను అధ్యాయనం చేసి డేటా పంపింది. డేటా ప్రకారం చంద్రుడిపై అంచనాలను మించి మంచు, నీరు ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. మూన్‌పై పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతల్లో వేరియేషన్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

New Update
Chandrayaan3's Vikram

Chandrayaan3's Vikram Photograph: (Chandrayaan3's Vikram)

చంద్రుడి దక్షిణ దృవంపైకి పంపించిన చంద్రయాన్ 3 మిషన్ కీలక డేటాను పంపింది. 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంలో విజయవంతంగా ల్యాండ్ అయిన ఈ మిషన్, చంద్రుని ఉపరితలం, కింద, ముఖ్యంగా ధ్రువ ప్రదేశాలలో ఉష్ణోగ్రత డేటాను శాస్త్రవేత్తలకు పంపింది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగమైన ChaSTE ప్రోబ్, ఉపరితలం నుండి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను కొలిచింది. ఇది చాలా వేరియబుల్ పరిస్థితులను వెల్లడించింది. ల్యాండింగ్ సైట్ శివ శక్తి పాయింట్ వద్ద ఉష్ణోగ్రతలు పగటిపూట 82C నుండి రాత్రి 170C వరకు ఉన్నాయని తెలిసింది.

Also read: All party meeting: నేడు అన్నీ పార్టీల MPలతో డిప్యూటీ CM భట్టి విక్రమార్క సమావేశం

పరిశోధకులు డెవలప్ చేసిన ఒక నమూనా ప్రకారం.. సూర్యుని నుండి దూరంగా ఉండి.. 14 డిగ్రీల కంటే ఎక్కువ వాలు కలిగిన చంద్రమండల ఉపరితలం మంచుతో పేరుకుపోయాయని అంచానా వేస్తున్నారు. ఈ విషయాన్ని  కమ్యూనికేషన్స్ ఎర్త్ & ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ప్రచురించారు. తాజా డేటా ప్రకారం చంద్రుడిపై అంచనాలను మించి మంచు, నీరు ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు.

Also Read: BIG BREAKING: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?

చంద్రుని ఉపరితలం క్రింద మరిన్ని ప్రదేశాలలో మంచు ఉండవచ్చని ఈ డేటా చెబుతుంది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో చంద్రయాన్-3 పరిశోధన బృందాన్ని దుర్గా ప్రసాద్ కరణం లీడ్ చేస్తున్నారు. ఈ బృందం మూన్‌పై మంచు ఏర్పడటంలో పెద్ద ఎత్తున, ఉష్ణోగ్రత వైవిధ్యాల చూపిస్తున్నాయని తెలిపింది. చంద్రుడిపై మానవ మనుగడ సాధ్యమేనా అని ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు