Bhatti Vikramarka: నేడు అన్నీ పార్టీల MPలతో డిప్యూటీ CM భట్టి విక్రమార్క సమావేశం

తెలంగాణ CM నేడు అన్నీ పార్టీల ఎంపీలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. MIM, BJP ఎంపీలకు ఫోన్ చేసి మీటింగ్‌కు రావాలని ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం పంపించారు.

New Update
Revanth and Batti 2

CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం (నేడు) ఉదయం 11గంటలకు అన్నీ పార్టీల ఎంపీలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. సమావేశంలో పాల్గొనాలని తెలంగాణ లోక్ సభ, రాజ్య సభ ఎంపీలను ఆహ్వానించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలకు ఫోన్ చేసి మీటింగ్‌కు పిలిచారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు అన్ని పార్టీల ఎంపీలకు ఆహ్వానం పంపించారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మీటింగ్‌లో చర్చించనున్నారు. నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను కూడా ఫోన్ చేసి పిలిచారు. BRS రాజ్యసభ ఎంపీలు ఆల్ పార్టీ మీటింగ్‌కు వస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read: BIG BREAKING: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?

తెలంగాణకు చెందిన 17 ఎంపీలందరితో ఈ మీటింగ్ జరగనుంది. రాష్ట్ర రుణ భారం తగ్గించుకోవడం, కేంద్రం నుంచి పన్నుల వాటా పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ అంశాలపై పార్లమెంట్ సభ్యులతో మాట్లాడనున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.

Advertisment
తాజా కథనాలు