Big Alert: ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం బిగ్ అలర్ట్.. ‘ఎలాగైనా ఇండియా వచ్చేయండి’

ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న భద్రతా ముప్పుల దృష్ట్యా భారతీయులందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని సూచించింది.

New Update
India

Big Alert:ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక(america iran crisis) జారీ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న భద్రతా ముప్పుల దృష్ట్యా భారతీయులందరూ(indian-citizens) తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని సూచించింది. "ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు కమర్షియల్ విమానాలతో సహా అందుబాటులో ఉన్న ఏవైనా ప్రయాణ సాధనాల ద్వారా వెంటనే దేశాన్ని వీడాలి" అని రాయబార కార్యాలయం తన ప్రకటనలో స్పష్టం చేసింది. గతంలో జనవరిలో జారీ చేసిన అడ్వైజరీకి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భారతీయులకు సాయం చేసేందుకు ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. +98 9128109115, +98 9128109109, +98 9128109102, +98 9932179359 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది. ప్రస్తుతం ఇరాన్‌లో వేలాది మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరి భద్రతపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తోంది. - america iran war

Also Read :  కేరళలో ఘోర అగ్ని ప్రమాదం...స్పాట్‌లో మూడు స్కూల్‌ బస్సులు...

అప్రమత్తత: ఇరాన్‌లో నిరసనలు లేదా భారీ ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
డాక్యుమెంట్స్: పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డులు, ఇతర ఇమ్మిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.
రిజిస్ట్రేషన్: ఇప్పటి వరకు ఎంబసీలో తమ వివరాలు నమోదు చేసుకోని వారు వెంటనే ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ ఇంటర్నెట్ సమస్యలు ఉంటే, భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
నిరంతర పర్యవేక్షణ: తాజా పరిణామాల కోసం స్థానిక వార్తా సంస్థలను గమనిస్తూ, భారత ఎంబసీతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని కోరింది.

Also Read :  ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు.. పదుల సంఖ్యలో పౌరుల మృతి

ఉద్రిక్తతలకు కారణాలు

అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు సందిగ్ధంలో పడటం, మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరించడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తు్న్నాడు. ఏ క్షణమైనా సైనిక దాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు ఇరాన్ లోపల విద్యార్థుల ఆందోళనలు కూడా తీవ్రమయ్యాయి.

Advertisment
తాజా కథనాలు