/rtv/media/media_files/2024/10/22/YnbP6Gz876OArgI9SEYa.jpg)
దసరా నేపథ్యంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. గాంధీ జయంతి నేపథ్యంలో దసరా నాడు మద్యం షాపులు తెరవలేదు. అయినా అమ్మకాలు మాత్రం ఆగలేదు. మద్యం ప్రియులు పండగ నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే కొనుగోళ్లు చేశారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 భారీగా అమ్మకాలు జరగడంతో ఈ విషయం స్పష్టం అవుతోంది. ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 26 నుంచి సాధారణ రోజులతో పోల్చితే మద్యం అమ్మకాడు డబుల్ అయినట్లు ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ వారంలో అమ్మకాలు రూ.1000 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. దసరా 3 రోజుల్లో 6.71 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. బీర్ల విషయానికి వస్తే 7.22 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. pic.twitter.com/UVYVBjZ0Fy
— Tolivelugu Official (@Tolivelugu) October 3, 2025
ఈ ఏడాది దసరా పండుగ, గాంధీ జయంతి రెండూ ఒకే రోజు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మద్యం షాపులు, చికెన్, మటన్ దుకాణాలను మూయాలని ఆదేశించింది. ప్రతీ ఏడాది దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే.. ఈ సారి మద్యం దుకాణాలు మూసి వేయడంతో భారీగా అమ్మకాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు రివర్స్ చేశారు మందుబాబులు. దసరా నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ మూసివేయగా.. చికెన్ మటన్ దుకాణాలు మాత్రం పలు ప్రాంతాల్లో తెరిచే ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఆయా దుకాణాలు చూసి చూడనట్లుగా వదిలేశారన్న చర్చ ఉంది.
𝐈𝐋𝐋𝐄𝐆𝐀𝐋 𝐏𝐑𝐎𝐂𝐔𝐑𝐄𝐌𝐄𝐍𝐓 𝐀𝐍𝐃 𝐒𝐀𝐋𝐄 𝐎𝐅 𝐈𝐌𝐅 𝐋𝐈𝐐𝐔𝐎𝐑 – 𝐎𝐍𝐄 𝐏𝐄𝐑𝐒𝐎𝐍 𝐀𝐏𝐏𝐑𝐄𝐇𝐄𝐍𝐃𝐄𝐃 – 𝐒𝐄𝐈𝐙𝐔𝐑𝐄 𝐎𝐅 𝟓𝟕.𝟐 𝐋𝐈𝐓𝐑𝐄𝐒 (𝟑𝟏𝟖 𝐁𝐎𝐓𝐓𝐋𝐄𝐒) 𝐖𝐎𝐑𝐓𝐇 𝐑𝐬.𝟔𝟎,𝟎𝟎𝟎/-
— Hyderabad City Police (@hydcitypolice) October 3, 2025
The sleuths of Commissioner’s Task Force, South Zone Team,… pic.twitter.com/fwB6hexRMY
ఇదిలా ఉంటే.. గాంధీ జయంతి నాడు దసరా రావడం బెల్ట్ షాపుల నిర్వాహకులకు భారీగా కలిసి వచ్చింది. వీరంతా రెండు రోజుల ముందే భారీగా కొనుగోళ్లు చేసి.. పండుగ నాడు భారీ ధరలకు అమ్ముకున్నారు. ఎక్సైజ్ అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ లోని మీర్ చౌక్కు చెందిన నర్సింగరావు అనే వ్యక్తి అనుమతులు లేకుండా భారీగా మద్యం నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిన్న దాడులు జరిపిన సౌత్ జోన్ పోలీసులు ఎమ్మార్పీ ధరకు షాపుల్లో మద్యం కొనుగోలు చేసి ఎక్కువకు అమ్ముతున్నట్లు తేల్చారు. అతని వద్ద 57.2 లీటర్ల మద్యాన్ని గుర్తించారు. ఈ మద్యం విలువ 60 వేలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.