Pahalgam Attack: కేంద్రం సంచలనం.. పహల్గాం ఉగ్రదాడి వీడియో విడుదల !

పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేసిన దృశ్యాలను కూడా బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

New Update
Indian Army at Terror Attack Site

Indian Army at Terror Attack Site

పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేసిన దృశ్యాలను కూడా బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే కేంద్రం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

ఇదిలాఉండగా మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌,  త్రివిధ దళాల అధిపతులు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి ధీటైన జవాబు ఇస్తామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. దాడికి సమయం, తేదీని సైన్యమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సైన్యంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని స్పష్టం చేశారు. 

Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

ఇక దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ బుధవారం రెండోసారి సమావేశమయ్యింది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (CCPA) సమావేశం జరిగింది. బుధవారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.

Also Read: పహల్గామ్ దాడికి ముందు సోషల్ మీడియాలో ఉగ్రవాదుల పోస్ట్ లు...తుపాకీ కావాలంటూ..

 telugu-news | rtv-news | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు