/rtv/media/media_files/2025/08/03/central-govt-cuts-prices-of-35-essential-medicines-2025-08-03-19-36-59.jpg)
Central Govt cuts prices of 35 essential medicines
కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకి గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో 35 రకాల మందుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మందులు అందుబాటు ధరలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ధరలు తగ్గించింది. గుండె సంబంధిత, మధుమేహం, ఒంటినొప్పులు అలాగే మానసిక వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలపై ఈ తగ్గింపు వర్తించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. రసాయనిక ఎరువుల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: హమాస్ భూగర్భ సొరంగంలో ఇజ్రాయెల్ బందీ.. తిండి లేక, బక్క చిక్కిన శరీరంతో దీన స్థితి
పారాసెటమాల్, అటోర్వాస్టాటిన్, ఎంపాగ్లిఫ్లోజిన్ తదితర మందులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచే కొనే యేసిలోఫెనాక్-పారాసెటమాల్-ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ ట్యాబ్లెట్ ధరను కేవంల రూ.13గా నిర్ణయించింది. క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ ధరను రూ.15గా, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వాడే అటోర్వాస్టాటిన్ 40 mg + క్లోపీడొగ్రెల్ 75 mg ట్యాబ్లెట్ ధరలను రూ.25.6గా పేర్కొంది. చిన్నారులకు వాడే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్స్ మాత్రలను అలాగే విటమిన్ డీ లోపం ఉన్నవారు వాడే కోలికాల్సిఫెరాల్ డ్రాప్స్ అలాగే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ధరను రూ.31గా నిర్ణయించింది. ఈ మాత్రల ధరల లిస్టును మెడికల్ షాపు నిర్వహించేవాళ్లందరూ ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించింది. ఎవరైనా ఈ మాత్రలను ఎక్కువ ధరలకు అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Govt fixes rates of 37 essential drugshttps://t.co/JP3YojU9Hj
— नीलिमा त्रिपाठी 🇮🇳 (@neelimatripathi) August 3, 2025
via NaMo App pic.twitter.com/97hfIOsj1c
అంతేకాదు రూల్స్ ఉల్లంఘించిన వాళ్లపై ఔషధ ధరల నియంత్రణ చట్టం ప్రకారం జరిమానాలు కూడా విధిస్తామని పేర్కొంది. అయితే ఆయా మెడిసన్ల ధరలను మినహాయించామని కానీ వాళ్లు అదనంగా GSTని చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే ఔషధ తయారీ కంపెనీలు కొత్త ధరల జాబితాను ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో అప్‌డేట్ చేయాలని చెప్పింది. వీటిని NPPA, రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్స్‌కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా నిర్ణయించిన ధరల ఆదేశాలతో ఆయా ఔషధాలపై ఉన్న ధరల ఉత్తర్వులు రద్దు చేసినట్లు పేర్కొంది.
Also Read: రష్యాపై విరుచుకపడ్డ ఉక్రెయిన్ డ్రోన్లు.. చమురు, ఆయుధ నిల్వలపై దాడులు
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) అధికారిక వెబ్‌సైట్‌లో ధరల తగ్గింపు జాబితాను, వాటి ధరలను చూసుకోవచ్చు. ఈ తగ్గింపు వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకి ఆర్థిక భారం తగ్గనుంది. దీంతో కేంద్ర తీసుకున్న నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిర్ణీత ధరలకు ఎక్కువగా మాత్రలు విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయవచ్చని.. వాళ్లపై చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.