/rtv/media/media_files/2025/12/25/aravalli-2025-12-25-08-23-36.jpg)
గత కొద్దిరోజులుగా ఆరావళి పర్వతాల నిర్వచనం, మైనింగ్ అనుమతులపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు #SaveAravalli అనే నినాదంతో సోషల్ మీడియాలో ఉద్యమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(central-government) స్పందిస్తూ, ఈ పర్వత ప్రాంతాల భౌగోళిక ఉనికిని కాపాడటానికి కఠిన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఇకపై ఎలాంటి కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయకూడదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
పర్యావరణంపై మైనింగ్ ప్రభావాన్ని అధ్యయనం చేయాలని 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్' సంస్థని కేంద్రం కోరింది. ఈ సంస్థ ఓ శాస్త్రీయ నివేదికను సిద్ధం చేసే వరకు కొత్త అనుమతులు నిలిపివేయబడతాయి. ఇప్పటికే కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలు అత్యంత కఠినమైన పర్యావరణ నిబంధనల మధ్య జరగాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం నిషేధం ఉన్న ప్రాంతాలతో పాటు, పర్యావరణ పరంగా సున్నితమైన మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని కూడా 'నో-మైనింగ్' జోన్లుగా ప్రకటించనున్నారు.
Also Read : ట్రావెలర్ బస్సు దగ్ధం.. 13 మందికి పైగా సజీవ దహనం
వివాదం ఏమిటి?
ఇటీవల సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాలకు(save Aravalli Hills) సంబంధించి ఓ కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది. దీని ప్రకారం 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వత శ్రేణిగా పరిగణించాలని ప్రతిపాదించారు. అయితే, దీనివల్ల తక్కువ ఎత్తు ఉన్న చిన్న గుట్టలు, పర్యావరణ ప్రాంతాలు మైనింగ్ మాఫియా చేతుల్లోకి వెళ్తాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే కేంద్రం రంగంలోకి దిగి పూర్తిస్థాయి నిషేధాన్ని ప్రకటించింది. - Aravalli Hills controversy
థార్ ఎడారి తూర్పు వైపు విస్తరించకుండా ఆరావళి పర్వతాలు సహజమైన గోడలా అడ్డుకుంటున్నాయి. ఇవి భూగర్భ జలాల రీఛార్జ్ కేంద్రాలుగా పనిచేస్తాయి. మైనింగ్ వల్ల ఈ సహజ నీటి వనరులు దెబ్బతింటున్నాయి. చిరుతపులులు, నీల్గాయ్ వంటి వందలాది జీవజాలానికి ఇవి నిలయాలు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం, వేడి గాలులు మరింత తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఆరావళి పర్వతాలకు కొంత ఊరట లభించినట్లయింది.
Also Read : డేటింగ్ చేసే జంటకు రూ.30 వేలు.. గవర్నమెంట్ బంపరాఫర్
Follow Us