BJP : అంబులెన్స్‌లో ఉత్సవానికి వచ్చిన కేంద్రమంత్రి!

కేంద్రమంత్రి సురేష్ గోపిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారుతాజాగా నిర్వహించిన ఓ ఉత్సవానికి ఆయన అంబులెన్స్‌లో వచ్చారని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

mini
New Update

Kerala : కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపిపై కేసు నమోదైంది. కేరళలో ప్రసిద్ధమైన ఉత్సవానికి ఆయన అంబులెన్స్‌లో వచ్చారని ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు అయ్యింది. కేరళలోని ప్రసిద్ధి చెందిన త్రిస్సూర్ పూరం అనే ఉత్సవానికి అంబులెన్స్‌లో మంత్రి వచ్చినట్లు  స్థానిక రాజకీయ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేరళ పోలీసులు తాజాగా ఈ విషయం గురించి కేసు నమోదు చేశారు. 

Also Read: ఉగ్రవాదిని పట్టించిన కుక్క బిస్కెట్లు!

Union Minister Suresh Gopi

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేష్ గోపి.. ఆ ఉత్సవానికి తన వాహనంలో కాకుండా అంబులెన్స్‌లో వచ్చారని స్థానికులు తెలిపారు. కేంద్రమంత్రి సురేష్ గోపి అలా రావడాన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. సురేష్ గోపికి సహాయం చేసేందుకే త్రిస్సూర్ పూరం ఉత్సవానికి అంతరాయం కలిగించారని ఆరోపించాయి. 

Also Read:  ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు స్వాహా

అప్పటి నుంచి దీనిపై వివాదం నడుస్తుండగా.. తాజాగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే తాను త్రిస్సూర్ పూరం ఉత్సవానికి అంబులెన్స్‌లో వచ్చినట్లు నమోదైన కేసుపై కేంద్రమంత్రి సురేష్ గోపి తాజాగా స్పందించారు. అవన్నీ అసత్య ఆరోపణలు అంటూ వాటిని ఖండించారు. 

Also Read: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి!

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు తాను అంబులెన్స్‌లో త్రిస్సూర్ పూరం ఉత్సవానికి రాలేదని.. అవన్నీ అబద్దాలని, ఒట్టి మాటలే అని  కొట్టిపారేశారు. తన సొంత కారులోనే ఆ ఉత్సవానికి వెళ్లానని చెప్పారు. తాను అంబులెన్స్‌లో వెళ్లడం ఎవరైనా చూశారా అని సురేష్‌ గోపి అన్నారు. ఒకవేళ ఎవరైనా చూస్తే అందుకు తగిన ఆధారాలు చూపించాలని అన్నారు. ఎవరైనా నిజాన్ని బయటపెట్టాలంటే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆధ్వర్యంలోని రాష్ట్ర పోలీసుల విచారణ సరిపోదని.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని అన్నారు. తాను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానంటూ ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి సవాల్‌ చేశారు.

Also Read:  నేడు కార్తీక సోమవారం.. శివుడిని ఎలా పూజించాలంటే?

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని త్రిస్సూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేష్ గోపి విజయాన్ని అందుకున్నారు. సీపీఐ నేత వీఎస్‌ సునీల్‌ కుమార్‌పై దాదాపు 70 వేల ఓట్ల మెజార్టీతో సురేష్ గోపి గెలుపొందారు. ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్న బీజేపీ.. సురేష్ గోపి త్రిస్సూర్‌లో గెలవడంతో కేరళలో తొలిసారి తన ఖాతా తెరిచింది. గెలిచిన ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కింది.

#bjp #union-minister #ambulance #suresh-gopi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe