Suresh Gopi: మరోసారి బీజేపీ ఎంపీ సురేష్ గోపీ సంచలన వ్యాఖ్యలు
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ది నేషన్'గా అభివర్ణించారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయాలకు ఆపాదించవద్దని మీడియాను కోరారు.