Jammu: ఉగ్రవాదిని పట్టించిన కుక్క బిస్కెట్లు! పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా సంస్థ టాప్ కమాండర్ ఉస్మాన్‌ను శనివారం జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.భద్రతా బలగాలు కుక్క బిస్కెట్లను ఆయుధంగా చేసుకుని.. ఉస్మాన్‌ను పట్టుకున్నాయి. By Bhavana 04 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లో శ్రీనగర్ లో శనివారం ఓ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోనే అత్యంత జనసాంద్రత ఉన్న ఖన్యార్ ప్రాంతంలో నక్కి ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఉస్మాన్‌ను పక్కా ప్లాన్ వేసి, వల పన్ని పట్టుకుని భారత సైనికులు హతమార్చారు. ఈ ఆపరేషన్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భద్రతా బలగాలు.. ఇందుకోసం భారీ ప్రణాళికను రచించింది. Also Read: మరికాసేపట్లో టెట్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి! శ్రీనగర్‌లో అత్యంత రద్దీగా ఉండే ఖన్యార్ ప్రాంతంలో ఉండే ఉస్మాన్‌ను పట్టుకునేందుకు వెళ్లగా అక్కడ మొత్తం ఉస్మాన్ కి బాగా తెలిసిన ప్రాంతమే. దీంతో అతను పరారయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టాయి. కానీ ఆ ప్రాంతంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉండడం సైన్యానికి మరో సవాల్ గా మారింది. Also Read: కార్తీక మాసం స్పెషల్ ఆఫర్...కేవలం 650 రూపాయలకే..! ఇందుకు సైనికులు ఓ కొత్త ప్లాన్‌ను వేశారు. అది సక్సెస్ అయి.. ఉస్మాన్ దొరకడంతో అతడ్ని హతమార్చారు. గత 2 ఏళ్లలో శ్రీనగర్‌లో చోటుచేసుకున్న కీలక ఎన్‌కౌంటర్ ఇదే. ఈ ఆపరేషన్ సక్సెస్ వెనుక.. కుక్క బిస్కెట్లు ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ఖన్యార్ ప్రాంతంలో ఉస్మాన్ ఉన్నాడని పక్కగా నిఘా సమాచారం అందుకున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. Also Read: షుగర్ పేషెంట్‌కు దివ్యాంగుల పెన్షన్...హైకోర్టు తీర్పు ఎలాగైనా సరే ఉస్మాన్‌ను పట్టుకునేందుకు పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఆ ప్రాంతంలో వీధి కుక్కల సమస్య అధికంగా ఉండటం వారికి మరో సవాల్‌గా మారింది. ఎక్కడ వీధి కుక్కలు మొరిగితే ఉస్మాన్ అలర్ట్ అయి.. అక్కడి నుంచి పారిపోతాడో అని గుర్తించిన అధికారులు..వెంటనే అప్రమత్తం అయ్యారు. Also Read: మంత్రికి పదవి గండం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు కుక్క బిస్కెట్లను.. ఇక ఆ పరిసరాలపై పూర్తి పట్టు ఉన్న ఉస్మాన్.. అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉండటంతో జవాన్లు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించారు.ఈ సమస్య పరిష్కారానికి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులు.. తమ వెంట కుక్క బిస్కెట్లను తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కనిపించిన కుక్కలకు ఆహారంగా బిస్కెట్లను వేస్తూ.. అవి అరవకుండా చూసుకున్నారు. చివరికి అతడు ఉన్న ప్రాంతాన్ని పక్కాగా గుర్తించారు. అయితే భద్రతా బలగాల రాకను గుర్తించిన ఉస్మాన్ వారిపైకి కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించిన సైనికులు.. అతడ్ని అక్కడికక్కడే తుదముట్టించాయి. దీంతో లష్కరే తోయిబాకు బిగ్ షాక్ తగిలింది. ఇక గత 20 ఏళ్లకుపైగా కాశ్మీర్ లోయలో ఉగ్ర కార్యకలాపాల్లో మునిగిపోయిన ఉస్మాన్.. స్థానికంగా అనేక ఉగ్రదాడులకు పాల్పడినట్లు సైనిక అధికారులు వెల్లడించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి