ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు స్వాహా నంద్యాలలోని రామాంజనేయులు క్రిప్టో కరెన్సీ పేరుతో ఘరానా మోసం చేశాడు. ట్రేడింగ్ చేస్తున్నానని, లక్ష పెట్టుబడికి నెలకి పదివేలు ఇస్తానని నమ్మించి ప్రజల నుంచి రూ.25 కోట్లు కాజేశాడు.నెలవారీ డబ్బులు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. By Kusuma 04 Nov 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి క్రిప్టో కరెన్సీ పేరుతో ఓ వ్యక్తి మోసం చేసిన దారుణ ఘటన నంద్యాలలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే రామాంజనేయులు అనే వ్యక్తి బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్‌లో ట్రేడింగ్ చేస్తున్నాని, లక్ష పెట్టుబడి పెడితే నెలకు పదివేలు ఇస్తానని అందరికి నమ్మించాడు. స్థానికంగా ఉన్న ప్రజలు అతన్ని నమ్మి అతని దగ్గర డబ్బులు కట్టడం ప్రారంభించారు. ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! బాధితులకు అనుమానం రావడంతో.. కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దాదాపుగా 300 మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేశాడు. నెలవారీగా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కానీ అతనిపై ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేదు. ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు! దీంతో బాధితులు పోలీసులపై మండిపడుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రోజులు గడుస్తున్న కూడా ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో బాధితులు ఆరోపిస్తున్నారు. 2021 నుంచి ప్రజలను మోసం చేస్తున్నాడని, ఇలా చాలా చోట్ల కూడా ప్రజలను మోసం చేసి డబ్బులు కాజేసినట్లు సమాచారం. ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రజలు డబ్బులకు ఆశపడి తెలియక ప్రతీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం ట్రేడింగ్‌కి మంచి డిమాండ్ ఉంది. లాభాలు వస్తాయని ప్రజలు నమ్మి ఏది మంచిదో అందులో ఇన్వెస్ట్ చేయడం లేదు. లక్ష పెడితే పదివేలు వడ్డీ వస్తుందని ఆశ చూపిస్తే చాలు.. డబ్బులు వస్తాయని భావించి కనీసం తెలియకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి వాటికి లోనవుకుండా ఉండాలని ప్రభుత్వం ఎన్ని చెబుతున్నా వినడం లేదు. ఇది కూడా చూడండి: కార్తీక మాసం స్పెషల్ ఆఫర్...కేవలం 650 రూపాయలకే..! #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి