TET Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి! మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రెండు విడతలుగా టెట్ నిర్వహించారు. By Bhavana 04 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి TET Results: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్ని మంత్రి లోకేష్ మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల కావాల్సి ఉండగా.. తుది ‘కీ’ వెల్లడిలో ఆలస్యం జరగడం ఫలితాల విడుదల తేదీని వాయిదా వేశారు. Also Read: కార్తీక మాసం స్పెషల్ ఆఫర్...కేవలం 650 రూపాయలకే..! ఈ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 21 వరకు నిర్వహించగా..ఈ పరీక్షలకు 3,68,661 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 4,27,300 మంది నిరుద్యోగులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 86.28% మంది పరీక్ష రాసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. Also Read: హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం.. గాంధీ మునిమనుమడు సంచలన వ్యాఖ్యలు 6న మెగా డీఎస్సీ ప్రకటన! ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా పని చేస్తామని చెప్పిన కూటమి సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కొరకు మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో టీడీపీ.. తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. Also Read: బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ షాక్.. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక Also Read: షుగర్ పేషెంట్‌కు దివ్యాంగుల పెన్షన్...హైకోర్టు తీర్పు ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేషనల్ ఉద్యోగాల రంగంలో భారీ ఉపాధి అవకాశాలు ఉండడంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ (నైపుణ్యాభివృద్ధి సంస్థ) దీనిపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగ యువతకు 1.10 కోట్ల మంది ఉండటంతో.. వారికి ఒకేషనల్ రంగంలో ఉపాధి కల్పించే పనిలో ఏపీ ప్రభుత్వం పడింది. ఈ మేరకు వారికి నైపుణ్య శిక్షణ చేపట్టింది. వీరికి ప్రారంభ వేతనం చాలా తక్కువగా ఉండటంతో.. ఈ అవకాశాలను పట్టించుకోవడం లేదు. దీంతో నిపుణుల కొరత ఏర్పడింది. రాష్ట్రంలో వేలసంఖ్యలో కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫ్లంబర్, ఏసీ రిపేరర్ వంటి ఉద్యోగాలు చాలానే ఉన్నట్లు సమాచారం. లింక్డ్‌ఇన్, నౌకరీ లాంటి జాబ్ పోర్టల్స్ నివేదికల ప్రకారం దీనిని అధికారులు గుర్తించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి