Space Station: ఆ ఏడాదికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్..!

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉంటుందని వెల్లడించారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడుతాడని పేర్కొన్నారు.

New Update
Space Station

అంతరిక్ష రంగంలో భారత్‌ వరుసగా సరికొత్త విజయాలు సాధిస్తోంది. తాజాగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఓ కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉంటుందని పేర్కొన్నారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడుతాడని అన్నారు. ఇప్పటికే అమెరికా, రష్యా, జపాన్, కెనాడా, యూరప్‌ దేశాలు కలిసి ఓ స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాయి. అలాగే చైనా కూడా సొంతగా స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. 2035లో నాటికి ఇక భారత్‌కు కూడా సొంత అంతరిక్ష కేంద్రం ఉన్న దేశంగా నిలవనుంది.    

Also Read: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా..కేంద్రం ఏర్పాట్లు

ISRO Space Station

ఇస్రో స్పేస్ స్టేషన్‌ కోసం పలు ప్రణాళికలు కూడా రూపొందించింది. 52 టన్నుల బీఏఎస్‌లో ముందుగా ముగ్గురు వ్యోమగాములు వెళ్లొచ్చు. భవిష్యత్‌లో దాని సామర్థ్యాన్ని ఆరుకి పెంచే ప్లాన్ కూడా ఉంది. బెంగళూరులో యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్‌లో జరిగిన కన్నడ సాంకేతిక సదస్సులో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.  

Also Read :  తైవాన్  జలదిగ్భంధం..చైనా ఆక్రమణ

బీఏఎస్ అనేది లైఫ్‌ సైన్సెస్, మెడిసన్ రంగాల్లో పరిశోధనలకు మద్దతు ఇచ్చేందుకు, అలాగే అంతరిక్ష పరిశోధనలు మెరుగుపరిచేందుకు అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్‌ స్పేస్‌ స్టేషన్. అయితే తొలి మాడ్యూల్‌ 2028లో ఎల్‌వీఎం 3 వాహకనౌక ద్వారా ప్రారంభించనట్లు భావిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత స్పేస్ స్టేషన్‌ తయారుకానుంది. అందులోని మాడ్యుల్స్‌ని వివిధ దశల్లో నింగిలోకి పంపిస్తారు. ఆ తర్వాత అంతరిక్షంలోనే వాటిని లింక్ చేస్తారు. మొత్తానికి 2035 నాటికి స్పేస్ స్టేషన్ పూర్తవుతుంది. ఈ స్టేషన్‌కు భారత అంతరిక్ష కేంద్రంగా నామకరణం కూడా చేశారు.

Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ఫైర్

అమెరికా, రష్యా, చైనా దేశాలు తమ వ్యోమగాముల్ని స్పేస్‌లోకి పంపిస్తున్నాయి. భారత్‌ కూడా ఆ జాబితాలో చేరనుంది. ఇదిలాఉండగా భారత్.. చంద్రయాన్-1 ప్రాజెక్టు చేపట్టి చంద్రునిపై తొలిసారిగా నీటిజాడలను గుర్తించిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత చంద్రయాన్‌-3తో చంద్రునిపై దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా కూడా మరో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు సొంతంగా స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకునే దిశగా ముందుకెళ్లడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.    

Also Read :  హైకోర్టుకు హీరో అల్లు అర్జున్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు