China: తైవాన్  జలదిగ్భంధం..చైనా ఆక్రమణ

తైవాన్ ద్వీపం చుట్టుపక్కల సముద్ర జలాలను చైనా ఆక్రమిస్తోంది. మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా డ్రాగన్ కంట్రీ తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 

New Update
00

తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సిద్ధమయ్యామని చైనా చెబుతోంది. ఇందులో భాగంగానే తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించేందుకు చర్యలు చేపట్టింది. తైవాన్ ద్వీపం చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనా తన బలగాలను మోహరించింది. విడిపోవాలని ఎవరు చూసినా సహించేది లేదని...అసలు అలాంటి ఆలోచనకే తావు లేదని చైనా హెచ్చరిస్తోంది. తైవాన్‌ వేర్పాటువాదులు బాహ్యశక్తులతో కుమ్మక్కయ్యే చర్యలపై బీజింగ్‌ అత్యంత అప్రమత్తంగా ఉంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, తైవాన్‌ జలసంధిలో సుస్థిరత నెలకొల్పడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చైనాలోని తైవాన్‌ అఫైర్స్‌ ఆఫీస్‌ విభాగం ప్రతినిధి ఝఫెంగ్లియాన్‌ చెప్పారు. 

అయితే సడెన్‌గా చైనా ఎందుకు ఈ చర్యలు చేపట్టంది అనేది మాత్రం తెలయడం లేదు. కానీ ఐవాన్ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తె అమెరికాకు చెందిన హవాయి, గువామ్‌లో పర్యటించారు. ఈ చర్యలు బీజింగ్‌కు బాగా కోపం తెప్పించాయి. అందుకే ఇప్పుడు తైవాన్ చుట్టుపక్కల మోహరింపులు చేపట్టందని చెబుతున్నారు. అమెరికాతో ఎవరు సబంధాలు పెట్టుకున్నా తాము సీరిస్ అవుతామని చైనా చెప్పేందుకే ఇలా చేస్తోందని అంటున్నారు.  దాదాపు 70 రోజులపాటు చైనా సైన్యం ప్లానింగ్‌ చేసి ఆ మేరకు తాజాగా మోహరింపులు చేపట్టిందని తైవాన్‌ మిలిటరీ అంచనా వేసింది. మరోవైపు ఇప్పటికే తైవాన్‌ అధ్యక్షుడు లాయ్‌ ప్రభుత్వం తమ దేశంపై బీజింగ్‌ సార్వభౌమ హక్కులను కొట్టిపారేసింది. 

Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ఫైర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు