Allu Arjun: హైకోర్టుకు హీరో అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. సంధ్య థియేటర్ కేసులో తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. 

New Update
ALLU ARJUN (2)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. సంధ్య థియేటర్ కేసులో తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల అంటే డిసెంబర్ 5న పుష్ప2 మూవీ రిలీజ్ అయింది. అయితే దీని కంటే ఒకరోజు ముందే అంటే 4వ తేదీన ప్రీమియర్ షో వేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది.

Also Read :  'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..!

ఈ తొక్కిసలాటలో రేవతి మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్, సినిమా యూనిట్, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు తనమీద నమోదు అయిన కేసును కొట్టివేయాలంటూ బన్నీ హైకోర్టులో పిటిషన్ వేశారు.  

Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!

ఇంతకీ ఏం జరిగింది?

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా నిన్న అంటే డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అదే సమయంలో ఈ సినిమా ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు.

దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. రేవతి ఆ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు

బాధితులకు అండగా ఉంటాం

ఈ ఘటనపై పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ స్పందించారు. బాధితులకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు. పుష్ప ప్రీమియర్ స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాదం సంఘటనకు ఎంతో భాదపడ్డాము. ఆ కుటుంబానికి, అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడికి మా ప్రార్థనలు ఉంటాయి. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి సాధ్యమైనంత సహాయాన్ని అందించడానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాయి అంటూ పోస్ట్ పెట్టారు.
ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు సంధ్య థియేటర్స్ యాజమాన్యం పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే థియేటర్స్ యాజమాన్యం కేసు నమోదు చేశారు. అదే సమయంలో అల్లు అర్జున్ పై సైతం హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read :  మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!

అల్లు అర్జున్‌పై కేసు నమోదు

సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 105,118(1) r/w 3(5) కింద కేసు నమోదైనట్టుగా వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు