/rtv/media/media_files/2025/07/13/kerala-cm-pinarayi-vijayan-2025-07-13-19-16-20.jpg)
Kerala CM Pinarayi vijayan
కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు పోలీస్ స్టేషన్‌కు ఓ ఇమెయిల్ పంపించారు. అందులో క్లీఫ్ హౌస్ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరికి అది ఫేక్ ఇమెయిల్‌గా గుర్తించారు.
Also Read: వచ్చే 5 ఏళ్లలో కోటి ఉద్యోగాలు.. సీఎం నితీష్ సంచలన ప్రకటన
బాంబు బెదిరింపు రావడంతో సీఎం నివాసాన్ని డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీ చేశామని తెలిపారు. మాకు ఎక్కడా ఎలాంటి అనుమానస్పద వస్తువు కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ తనిఖీల సమయంలో సీఎం విజయన్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారని చెప్పారు. ఇటీవల పలు సంస్థలను టార్గె్ట్ చేసుకొని బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఈ బెదిరింపుల వ్యవహారంతో ఇప్పుడు వచ్చిన ఇమెయిల్‌కు ఏదైనా సంబంధం ఉందా ? లేదా ? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్